Share News

TTD: శ్రీవారి దర్శన టికెట్లు విడుదల.. భక్తుల నుంచి అనూహ్య స్పందన

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:23 PM

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది.

TTD: శ్రీవారి దర్శన టికెట్లు విడుదల.. భక్తుల నుంచి అనూహ్య స్పందన

తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ నెల 20వ తేదీ నుంచి నేటి వరకు పలు దర్శనం టికెట్లను ఆన్ లైన్లో టీటీడీ విడుదల చేసింది. వేల సంఖ్యలోని ఆర్జిత సేవా టికెట్లను గంటా 25 నిమిషాల వ్యవధిలోనే భక్తులకు లభించాయి.


2 నిమిషాల 30 సెంకడ్లలోనే అంగ ప్రదక్షిణ టోకెన్లను పొందారు. 10 నిమిషాల 11 సెకండ్ల వ్యవధిలోనే వయోవృద్ధుల వికలాంగుల దర్శన టోకెన్లు దొరికాయి. నాలుగున్నర లక్షల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రెండు గంటల 6 నిమిషాల వ్యవధిలోనే పొందారు. గంటా 40 నిమిషాల వ్యవధిలోనే వసతి గదుల కోటాను శ్రీవారి భక్తులకు టీటీడీ కల్పించింది.


ఈ వార్తలు కూడా చదవండి

Breaking News: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

AP Govt: జీఏడీలో రిపోర్టు చేసిన కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి..

Read Latest and Telugu News and Andhra Pradesh News

Updated Date - Jun 26 , 2024 | 04:27 PM