Share News

AP Elections: కూటమి అభ్యర్థికి మద్దతుగా జేపీ, లోకేష్ రోడ్‌ షో

ABN , Publish Date - May 11 , 2024 | 10:42 AM

Andhrapradesh: కూటమి అభ్యర్థికి మద్దతుగా రోడ్‌ షోలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో నిర్వహించే రోడ్‌ షోలో పాల్గొనేందుకు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం జేపీ నడ్డాతో కలిసి లోకేష్‌ రోడ్ షో నిర్వహించారు. జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం కోసం ప్రత్యేక విమానంలో లోకేష్‌ తిరుపతికి వచ్చారు.

AP Elections: కూటమి అభ్యర్థికి మద్దతుగా జేపీ, లోకేష్ రోడ్‌ షో
BJP National Chief JP Nadda, TDP Leader Lokesh road show

తిరుపతి, మే 11: కూటమి అభ్యర్థికి మద్దతుగా రోడ్‌ షోలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (BJP National Chief JP Nadda) తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో నిర్వహించే రోడ్‌ షోలో పాల్గొనేందుకు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) ఇప్పటికే జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం జేపీ నడ్డాతో కలిసి లోకేష్‌ రోడ్ షో నిర్వహించారు. జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి (Janasena Candidate Arani Srinivasulu) శ్రీనివాసులు ప్రచారం కోసం ప్రత్యేక విమానంలో లోకేష్‌ తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌కు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు రోడ్ షో జరుగనుంది. రోడ్డు షో నిర్వహించే ప్రాంతం వద్దకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వచ్చారు.

Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్


అంతకుముందు ఉదయం తిరుపతి చేరుకున్న జేపీ నడ్డా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... శ్రీవారిని దర్శించుకుని.. స్వామి వారి ఆశీర్వాదం పొందానన్నారు. దేశం, సమాజంలో ప్రజలందరూ సుఖంగా ఉండడంతో పాటు అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్ధించానని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సమవృద్ధి భారత్, సంక్షేమ భారత్, సురక్షిత భారత్ దిశగా దేశం పయనించాలని వేడుకున్నట్లు జేపీ నడ్డా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Arvind Kejriwal Bail: ఆంజనేయుడి చెంతకు అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలి ప్రచారం నేడే

Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ వింత లీలలు!

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 10:45 AM