AP Elections: నామినేషన్‌కు భారీ ర్యాలీగా వెళ్తున్న సుజనా చౌదరి
ABN , Publish Date - Apr 18 , 2024 | 10:52 AM
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కాసేపట్లో మొదలుకానుంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. ఈరోజు మంచి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈరోజు ఉదయం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం చిట్టినగర్‌లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
విజయవాడ, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) నామినేషన్ల (Nominations) స్వీకరణ ప్రక్రియ కాసేపట్లో మొదలుకానుంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. ఈరోజు మంచి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈరోజు ఉదయం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం చిట్టినగర్‌లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ ర్యాలీకి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బీజేపీ, టీడీపీ, జనసేన జెండాలు, బెలూన్లతో వన్ టౌన్ సందడిగా మారింది. ర్యాలీలో వంగవీటి రాధాకృష్ణ, కొనకళ్ల నారాయణ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీను, అడ్డూరి శ్రీరామ్, అమ్మిశెట్టి వాసు, రావి సౌజన్య పాల్గొన్నారు.
Vijayawada Politics: ‘బెజవాడ’ బ్రదర్స్.. బాహాబాహీ..
అభివృద్ధి చేసి చూపిస్తా....
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సర్దార్ మరుపిళ్ల చిట్టీ అనేక త్యాగాలు చేశారన్నారు. వన్ టౌన్‌ను ఆనాడు అభివృద్ధి చేశారని... తరువాత వచ్చిన కొంతమంది నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి విజయం ఖాయమని.. అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతానని స్పష్టం చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు తిరోగమనం పట్టించారని వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా ఈ అరాచక పాలనను సాగనంపేందుకు సిద్దం అంటున్నారని తెలిపారు. రాజకీయ రాజధాని విజయవాడ అని.. అభివృద్ధి, ఆర్ధిక రాజధానిగా మార్చి చూపిస్తామని సుజనా చౌదరి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
AP Politics: ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీ.. ఎక్కడంటే?
CM Jagan: జగన్ బస్సు యాత్ర ఉంటే.. ఆ ఏరియాలో ఎవరూ బతకొద్దా?
మరిన్ని ఏపీ వార్తల కోసం...