Share News

TDP Leaders: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌‌... తమ్ముళ్ల ఆగ్రహం

ABN , Publish Date - May 16 , 2024 | 01:16 PM

Andhrapradesh: ఏపీలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు అల్లర్లకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఆరుగురిని సభ్యులుగా చేర్చుతూ.. వారంతో అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లి టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని అధినేత ఆదేశించారు.

TDP Leaders: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌‌... తమ్ముళ్ల ఆగ్రహం
TDP Leader House Arrest

అమరావతి, మే 16: ఏపీలో పలువురు టీడీపీ నేతలను (TDP Leaders) పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేస్తున్నారు. పల్నాడు అల్లర్లకు (Palnadu Attacks) సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఆరుగురిని సభ్యులుగా చేర్చుతూ.. వారంతో అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లి టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని అధినేత ఆదేశించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు.

Gudivada Amarnath: ‘వన్ సైడ్ విక్టరీ మాదే...మళ్లీ జగనే సీఎం’


భోగాపురంలో బోండా ఉమా...

విశాఖపట్నంలోని భోగాపురంలో టీడీపీ నేత బోండా ఉమను (TDP Leader Bonda Uma) పోలీసులు గృహనిర్బంధం చేశారు. పల్నాడు కమిటీలో ఉమ సభ్యుడు కావడంతో హౌస్ అరెస్ట్‌కు వచ్చామని పోలీసులు చెబుతున్నారు. అయితే తాను భోగాపురంలో బావమరిది ఇంటికి ఫంక్షన్‌కు వచ్చానని బోండా ఉమా చెప్పినా పోలీసులు వినిపించుకోని పరిస్థితి. తాను విశాఖ నుంచి పల్నాడుకు ఎలా వెళ్తానంటూ టీడీపీ నేత ప్రశ్నించారు. ఇంత చెప్పినప్పటికీ పోలీసుల మాత్రం వెనక్కి తగ్గలేదు. ‘‘అయినా సరే, బయటకు వెళ్లవద్దు’’ అంటూ ఖాకీలు స్పష్టం చేశారు. అయితే నోటీస్ తీసుకునేందుకు ఉమా తిరస్కరించారు. భోగాపురంలో ఉమా బస చేసిన ఇంటి వద్ద భోగాపురం పోలీసులు మకాం వేశారు.

TDP Mahanadu: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!


నక్కా ఆనంబాబును కూడా..

మరోవైపు మాజీ మంత్రి నక్కా ఆనందబాబును (Former Minister Nakka Anandbabu) కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంకా వింతపోకడలు మానుకోవడంలేదని, త్వరలోనే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని వాళ్లకు చెప్పినట్లు ఆయన తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షించకుండా.. మమ్మలి హౌస్ అరెస్టు చేయడమేంటని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. నక్కా ఆనందబాబుతో పాటు టీడీపీ అభ్యర్థులు జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావులును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Chicken: పనీర్ బిర్యానీలో చికెన్.. మా మత విశ్వాసాలు దెబ్బతిన్నాయన్న కస్టమర్.. జొమాటో రియాక్షన్ ఏంటంటే..


కమిటీ సభ్యులుగా...

కాగా పల్నాడు అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. దాడుల నేపథ్యంలో టీడీపీ నేతలకు అండగా నిలబడేందుకు అధినేత ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బోండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

Air India Flight: విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

Hyderabad: రాత్రివేళ.. రోడ్డుపైనే..

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 01:20 PM