Share News

Minister Narayana: రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:34 PM

రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.

Minister Narayana: రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలి
Minister Narayana

అమరావతి: రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు స్టేరిలైజేషన్ చేయించాలన్నారు. టౌన్ ప్లానింగ్‌పై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. గ‌త ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవినీతి జరిగిందని అన్నారు. త‌ణుకు, విశాఖ‌పట్నం, గుంటూరు, తిరుప‌తిలో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పారు. అధికారుల‌తో పాటు నేత‌ల ప్రమేయం ఉంటే చ‌ర్యలు త‌ప్పవని హెచ్చరించారు. సీఎంతో చ‌ర్చించి విచార‌ణ క‌మిటీలు వేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ‌ తెలిపారు.


విద్యార్థి మృతిపై నారాయ‌ణ దిగ్భ్రాంతి

మరోవైపు నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మ‌ర‌ణించార‌న్న విష‌యం తెలుసుకున్న మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమ‌రావ‌తిలోని త‌న ఛాంబ‌ర్‌లో ఉన్న మంత్రి నారాయ‌ణ‌కు ఆ స‌మ‌యంలో అక్కడే ఉన్న మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సూర్యతేజ ఈ ప్రమాద విష‌యాన్ని తెలిపారు.


పాఠశాలలో గోడ కూలి తొమ్మిదో తరగతి చదువుతున్న గురుమహేంద్ర(14)అనే విద్యార్థి దుర‌దృష్టవ‌శాత్తూ మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని నెల్లూరు జిల్లా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని భ‌రోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రక‌టించారు. శ‌నివారం తాను నెల్లూరుకు చేరుకుని బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి... ప్రభుత్వం త‌రుపున రూ.5 ల‌క్షల చెక్కును అందిస్తానని మంత్రి నారాయణ తెలిపారు.


Also Read:

లోకేశ్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ!

వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా..

వీడు పిల్లాడా.. లేక సర్కస్ ట్రైనరా.. ఎగ్జిబిషన్‌లో ...

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 26 , 2024 | 10:54 PM