Share News

AP Politics: షర్మిలపై సంచలన ఆరోపణలు చేసిన సుంకర పద్మశ్రీ

ABN , Publish Date - Jun 21 , 2024 | 09:35 PM

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల (Sharmila) నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె .సి .వేణుగోపాల్‌కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకరపద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని ఆరోపించారు.

AP Politics: షర్మిలపై సంచలన ఆరోపణలు చేసిన సుంకర పద్మశ్రీ

అమరావతి: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల (Sharmila) నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె .సి .వేణుగోపాల్‌కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకరపద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోఖో మాదిరిగా వ్యవహరించారని విమర్శించారు. ఆమె పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల్లో తీవ్రప్రభావం పడిందని తెలిపారు.


అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్ఠానం అందించిన నిధులు సైతం గోల్‌మాల్ అయ్యాయని ఆరోపణలు చేశారు. అధిష్ఠానం షర్మిలని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమించినప్పుడు పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నామని.. కానీ ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చారని చెప్పారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని అన్నారు.


ఆమె అవగాహన రాహిత్యం కాంగ్రెస్ క్యాడర్, నాయకులను నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు. తెలంగాణకు చెందిన షర్మిలకు చెందిన కొందరు అనునాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాల్లో జోక్యం చేసుకున్నారని విమర్శలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి B ఫార్మ్ కేటాయించారన్నారు. సీడబ్ల్యూసీ మెంబర్లు , సీనియర్ నాయకులు , పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు , డీసీసీ ప్రెసిడెంట్ల సూచనలను షర్మిల పరిగణనలోకి తీసుకోలేదని సుంకరపద్మశ్రీ, రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 10:35 PM