Share News

Madhuyashki: ఈనెల 22న ఈడీ ఆఫీసుల వద్ద ఆందోళనకు కాంగ్రెస్ సిద్ధం...

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:53 PM

Andhrapradesh: వ్యాపారస్తుల సపోర్ట్‌తో మళ్ళీ అధికారంలోకి మోడీ గవర్నమెంట్ వచ్చిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్ట్ 22న ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళన చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ సంస్థలను ఆదానీకి పనికొచ్చే విధంగా మార్పు చేశారని విమర్శించారు.

Madhuyashki: ఈనెల 22న ఈడీ ఆఫీసుల వద్ద ఆందోళనకు కాంగ్రెస్ సిద్ధం...
AICC spokesperson Madhuyashki Goud

విజయవాడ, ఆగస్టు 21: వ్యాపారస్తుల సపోర్ట్‌తో మళ్ళీ అధికారంలోకి మోడీ (PM Modi) గవర్నమెంట్ వచ్చిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ (AICC spokesperson Madhuyashki Goud) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్ట్ 22న ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళన చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ సంస్థలను ఆదానీకి పనికొచ్చే విధంగా మార్పు చేశారని విమర్శించారు. ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్, జీవీకే గ్రూప్స్‌పై ఈడి దాడి చేస్తే.. అన్ని కంపెనీలు ఆదాని పరమయ్యాయన్నారు. ఆల్ట్రాటెక్ సిమెంట్‌పై ఆదానిపై కామెంట్ చేస్తే సీబీఐ రైడ్ చేసిందన్నారు.

Nara Lokesh: బాబు కాదు.. ఢిల్లీలో ఇకపై చక్రం తిప్పేది చినబాబేనట..!!


ఆదాని కంపెనీల్లో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ షేర్లు పెడుతున్నాయని... ఎవరి ప్రోద్బలంతో ఆదాని కంపెనీల్లో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీషేర్లు పెడుతున్నదో ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ విదేశీ పర్యటనలో కూడా ఆదానిని తీసుకొని వెళ్లి కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. ఆదాని, అంబానీలతో వ్యాపారాలకు మోడీ అండదండలు ఇస్తున్నారని...మాట వినని కార్పొరేట్ సంస్థలను ఈడి, ఐటీలతో రైడ్స్ చేయిస్తూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవీకే గ్రూప్స్, కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళని బెదిరించారన్నారు.


మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించారు. దేశంలోనే కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ఆదాని గ్రూప్స్‌కే కంపెనీ అనుమతులు ఇవ్వాలని మోడీ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. దేశ సంపదను ఆదాని గ్రూప్స్ ద్వారా బయట దేశాలకు తరలిస్తున్నారన్నారు. మనీలాండరింగ్‌కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోడీ, ఆదాని, సెబీ చైర్ పర్సన్ ముగ్గురు కలిపి దేశ సంపదను దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాని కోసం మోడీ, సెబీ చైర్ పర్సన్ పని చేస్తున్నారని.. దీని పరిష్కారం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని.. అప్పుడే ఇందులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేశారు.

TG Highcourt: వివేకా కేసులో ఉదయ్‌కు బెయిల్ మంజూరు



గత 10 ఏళ్లుగా మోడీ రాజ్యాంగమైన సంస్థలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రాణమిత్రులకు మొత్తం దేశాన్ని కట్టబెట్టారన్నారు. ఆదానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే అదానీతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఆదాని వ్యాపార అభివృద్ధికి మోడీనే కారణమని... మోడీ అవినీతిపై ఎక్కడ మాట్లాడనివ్వరన్నారు. పార్లమెంట్‌లో మైకులు కట్ చేస్తున్నారని అన్నారు. మోడీ అవినీతిపై నేడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మీడియా సమావేశాలు పెట్టామన్నారు. ప్రభుత్వ సంస్థలను అదానీ సంస్థల అభివృద్ధి కోసం వాడుకుంటున్నారని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

TG Highcourt: వివేకా కేసులో ఉదయ్‌కు బెయిల్ మంజూరు

Purandeshwari: లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 01:55 PM