Share News

Minister Ramanaidu: జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

ABN , Publish Date - Sep 14 , 2024 | 05:48 PM

బుడమేరు గండ్లను 58 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా గట్ల మీదే మకాం వేసి పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. మిలటరీ బలగాలు ఆశ్చర్యానికి లోనై ‘శభాష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని కొనియాడాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

Minister Ramanaidu: జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

పశ్చిమగోదావరి: జగన్ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లులో అద్దేపల్లి జయంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అద్దేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి నిమ్మల ఘనంగా నివాళులర్పించారు.


ALSO READ: Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ... ఏపీలో వరదలకు కారణం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు గ్రహించారని అన్నారు. సీఎం చంద్రబాబు 74 సంవత్సరాల వయస్సులో వరద నీటిలో నడిచి బాధితులను పరామర్శించారని తెలిపారు.


ALSO READ: :Pawan Kalyan: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

బుడమేరు గండ్లను 58 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా గట్ల మీదే మకాం వేసి పూడ్చామని అన్నారు. మిలటరీ బలగాలు ఆశ్చర్యానికి లోనై శభాష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కొనియాడాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో విజయవంతం చేయగలిగామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Excise Department: కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం ఉంది..

Vijayawada: విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 14 , 2024 | 06:03 PM