Daggubati Purandeswari: ఏపీలో సెప్టెంబర్ ఒకటి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం..
ABN , Publish Date - Aug 30 , 2024 | 02:05 PM
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు ముడోసారి మోదీని ప్రధానిని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రామమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాన నిలుస్తుంది కాబట్టే మూడోసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె చెప్పారు.
విజయవాడ: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు ముడోసారి మోదీని ప్రధానిని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రామమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాన నిలుస్తుంది కాబట్టే మూడోసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె చెప్పారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ యువ మోర్చా సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. "గుడ్లవల్లేరు కాలేజీలో విద్యార్థినిల బాత్ రూమ్‍ల్లో సీసీ కెమెరాలు పెట్టిన ఘటన బాధాకరం. ఇలాంటి ఘటన సిగ్గుపడాల్సిన విషయం. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి. సెప్టెంబర్ ఒకటి ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఏపీలో కోటి మందికి సభ్యత్వం ఇవ్వడమే లక్ష్యం.
2014లో దేశవ్యాప్తంగా 11కోట్ల మంది సభ్యులుగా చేరారు. కరోనా కారణంగా ఐదేళ్లుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయలేదు. ప్రస్తుతం 18కోట్ల మంది పార్టీలో సభ్యులుగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీపై దుష్ప్రచారం జరిగింది. అందువల్లే మేము 40, 50సీట్లు కోల్పోయాం. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. రాజ్యాంగాన్ని తీసివేసే ప్రసక్తే లేదు. యువ మోర్చా నాయకులు కేంద్ర ప్రభుత్వం యువతకు అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కొప్పర్తి, ఓర్వకల్లు రెండు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. వేల కోట్ల రూపాయలతో అక్కడ పరిశ్రమలు రానున్నాయి. వీటి ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Actress Jithwani: ముంబై నటి స్టేట్‌మెంట్ రికార్డు.. కన్నీరు పెట్టుకున్న జిత్వానీ
AP Govt: ఒకే కాంట్రాక్టర్‌కు రూ.64 కోట్ల చెల్లింపులు... ఆర్థిక శాఖలో బయటపడుతున్న వాస్తవాలు
Budda Venkanna: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం