Share News

Mahasena Rajesh: ఆ సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు

ABN , Publish Date - Jul 18 , 2024 | 03:41 PM

Andhrapradesh: వైసీపీ భూతానికి సీఎం చంద్రబాబు సమాధి కట్టారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అరుంధతి సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలు, అరాచకాలంటూ అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలే విషం పెట్టి... కూటమిపై నెట్టేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mahasena Rajesh: ఆ సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు
TDP Leader Mahasena Rajesh

అమరావతి, జూలై 18: వైసీపీ భూతానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమాధి కట్టారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ (TDP Leader Mahasena Rajesh) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అరుంధతి సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలు, అరాచకాలంటూ అబద్దాలు ఆడుతున్నారని అన్నారు.

Nara Lokesh: జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ కౌంటర్..


వైసీపీ నేతలే విషం పెట్టి... కూటమిపై నెట్టేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ అరాచకాలకు, హత్యలకు అడ్డు అదుపు లేదన్నారు. సమాధిలో ఉన్న వైసీపీ భూతాలను బయటికి రానిస్తే ప్రజల రక్తం తాగుతాయన్నారు. ఏపీని స్మశానం చేయడానికే వైసీపీ తప్పుడు ప్రచారానికి పూనుకుందన్నారు. వైసీపీ హయాంలో 600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో కూటమి వస్తున్న క్రెడిట్‌ను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ప్రజలే తిప్పి కొట్టాలని మహసేన రాజేష్ పిలుపునిచ్చారు.

Anam Ramanarayana Reddy: విజయసాయిపై సంచలన ఆరోపణలు


అయితే గత రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్‌ రషీద్‌ అనే యువకుడి దారుణంగా హత్య చేశారు. అయితే ఈ ఘటనపై వైసీపీ చేస్తున్న ప్రచారంపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే పనిగా పెట్టుకున్నారంటూ టీడీపీ ట్విట్టర్ వేదికగా మండిపడింది. ‘‘తప్పు ఎవ్వడు చేసినా తప్పే... తప్పు చేసిన వాడిని కూడా కఠినంగా శిక్షించాలి. 5 ఏళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఈ వైసీపీ సైకోలకి పట్టిన మదం దించి, గంజాయిని అరికట్టటం, వైసీపీ సైకోలు చేసే ఈ దారుణాలు ఆపటడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని టీడీపీ ట్విట్టర్‌లో తేల్చిచెప్పింది.


అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వినుకొండ హత్య ఉందంపై స్పందిస్తూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: పుంగనూరులో ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల రాళ్ల దాడి..

Telangana చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 03:46 PM