Share News

AP Politics: రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ కొత్త ఎత్తుగడలు..

ABN , Publish Date - Jul 19 , 2024 | 06:58 AM

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్‌ పూర్తిగా డీలా పడింది. సానుకూల ఫలితాలు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్‌ (Y S Jagan) సైతం కొద్దిరోజుల పాటు చడీచప్పుడు లేకుండా సైలెంట్‌ అయిపోయారు.

AP Politics: రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ కొత్త ఎత్తుగడలు..
YSRCP and Jagan

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్‌ పూర్తిగా డీలా పడింది. సానుకూల ఫలితాలు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్‌ (Y S Jagan) సైతం కొద్దిరోజుల పాటు చడీచప్పుడు లేకుండా సైలెంట్‌ అయిపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తూ.. నేను పాలిటిక్స్‌లో యాక్టివ్‌గానే ఉన్నానంటూ పార్టీ శ్రేణులకు సందేశమిచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. సొంత గడ్డపైనే పార్టీ శ్రేణుల నుంచి నిరసన ఎదుర్కొవల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత కొద్దిరోజులు బెంగళూరు (Bengaluru) వెళ్లి మళ్లీ తాడేపల్లి ప్యాలెస్‌కు తిరిగొచ్చారు. ఆ తర్వాత నెల్లూరు సెంట్రల్‌ జైల్లో ఉన్న పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి.. దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తాం.. ప్రభుత్వానికి వార్నింగ్‌ అంటూ పార్టీ శ్రేణుల్లో కొంత ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.. జగన్‌ ఎన్ని విధాలా ప్రయత్నించినా.. పార్టీ క్యాడర్‌ మాత్రం పూర్తిస్థాయిలో యాక్టివ్‌ కావడంలేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీ క్యాడర్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలో ఏదో పార్టీలోకి వెళ్లిపోతారని.. అప్పుడు వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ రాజకీయ భవిష్యత్తు కోసం జగన్‌ ఓ కొత్త ప్లాన్‌ వేశారనే చర్చ జరుగుతోంది.

ఎంపీ విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టింది: మంత్రి కొల్లు


ఆ ప్లాన్‌ ఏమిటి..

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు మాత్రమే గడిచింది. ఇప్పటినుంచే ఎన్నికల హామీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజలు పెద్దగా పట్టించుకోరు.. కొత్త ప్రభుత్వానికి మరికొన్ని రోజులు సమయమివ్వాలని సామాన్య ప్రజలే అంటున్న క్రమంలో ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరుకున పెట్టాలనే ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా వినుకొండలో జరిగిన ఓ హత్యను జగన్‌ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వినుకొండ హత్యకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, పాత కక్షలే హత్యకు కారణమని స్వయంగా ఎస్పీ వెల్లడించినా.. ఈ ఘటనలో ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేస్తూ టీడీపీపై జగన్‌ విమర్శలు చేయడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందట. ప్రశాంతంగా ఉన్న ఏపీలో శాంతి, భద్రతల సమస్య సృష్టించి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే కుట్రకు జగన్‌ శ్రీకారం చుట్టారనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏపీలో శాంతి, భద్రతలు క్షీణించాయని.. అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తానంటూ ప్రధానికి జగన్ లేఖ రాయడం ఈ ఎత్తుగడలో భాగమని తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదికలు సమర్పిస్తూ ఉంటారు. అయితే జగన్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రధానికి లేఖ రాయడం వెనుక.. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి.. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలనే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చని కొందరు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Amaravati : భార్యాభర్తల మధ్య విభేదాలు చిన్నారుల సంరక్షణకు అవరోధం కారాదు


లక్ష్యం అదేనా..

ఎక్కడైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా.. ఎవరి పాలన బెటర్‌గా ఉందని అంచనా వేసుకుంటారు. అభివృద్ధి, సంక్షేమంపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత మరోసారి ప్రభుత్వాన్ని గెలిపించాలా.. ఓడించాలో ఓటర్లు నిర్ణయిస్తారు. కాని వైసీపీ మాత్రం ప్రభుత్వంపై ఇప్పటినుంచే బురద జల్లితే.. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసి.. ఆ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలాన్ని కొంతమేర తగ్గించగలిగితే.. రెండేళ్లు కాకుండానే కొత్త ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారాన్ని వచ్చే ఎన్నికల వరకు తీసుకెళ్లాలనే ఆలోచనలో వైసీపీ ఉందనే చర్చ నడుస్తోంది. మరోవైపు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవాలనే ప్లాన్‌లో వైసీపీ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ప్రజలు వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా వైసీపీ తన బుద్ధిని మార్చుకుని.. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడండ ద్వారా విపక్ష పాత్రను పోషిస్తుందా.. లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.


అరాచకం గురించి జగన్‌ మాట్లాడితే రోత పుడుతోంది: లోకేశ్‌

ఇసుక మాఫియాను విడిచిపెట్టం: మంత్రి సుభాశ్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 19 , 2024 | 07:10 AM