Kandula Durgesh: నంద్యాల అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 14 , 2024 | 05:49 PM
నంద్యాలను టూరిజం హబ్‌గా తయారు చేస్తామని ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు.
నంద్యాల: నంద్యాలను టూరిజం హబ్‌గా తయారు చేస్తామని ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు. జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు(ఆదివారం) మంత్రి నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు పంచుకున్నారు.
నిధుల సమీకరణకు ఇబ్బంది లేదని చెప్పారు. చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు నంద్యాల చుట్టూ ఉన్న శైవక్షేత్రాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచారామాలు ఎలా ఉన్నాయో... ఈ ప్రాంతంలో నవనందులు కూడా అలాగే ఉన్నాయని వాటన్నింటినీ అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చి నంద్యాల జిల్లాను టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జిల్లాలో శైవ క్షేత్రాలు అధికంగా ఉన్నందున వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి తిరుపతి, శ్రీకాళహస్తి తరహాలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.