Share News

Balineni : జనసేనలో చేరికపై బాలినేని ఏమన్నారంటే..?

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:42 PM

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivas Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరుతున్నారంటూ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి నేటి వరకూ పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది.

Balineni : జనసేనలో చేరికపై బాలినేని ఏమన్నారంటే..?
Balineni Srinivas Reddy

ప్రకాశం: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivas Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరుతున్నారంటూ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి నేటి వరకూ పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై బాలినేని ఓ క్లారిటీ ఇచ్చారు. తాను జనసేన పార్టీలోకి వెళ్తున్నానన్నది కేవలం ఊహాగానాలు మాత్రమేనని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయని అన్నారు. ఎన్నికలకు ముందు ఇవే తన చివరి ఎన్నికలు అని చెప్పానని గుర్తుచేశారు. ఈరోజు(సోమవారం) ఒంగోలులో మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు.


ALSO Read: CM Chandrababu : వైసీపీ ప్రభుత్వం కొత్త విధానంతో దోపిడీ చేసింది

తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోండి..

‘‘ఎవరి ఆలోచన ఏంటో ప్రజలు నన్ను గెలిపించలేదు. ఫలితాల అనంతరం మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం చేశారు. గతంలో మేము ఇలానే చేస్తే మీ పరిస్థితి ఎలా ఉండేది. రాజకీయాలు నేను వద్దనుకున్న సమయంలో మా కార్యకర్తలపై దాడులు చేసి నన్ను తిరిగి తీసుకువచ్చి రాజకీయం మీరే చేయిస్తున్నారు. నేను ఎక్కడకు వెళ్లేది లేదు.. ఒంగోల్లోనే ఉంటా. మీరు ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్‌గా నా మీదే చేయండి. దుష్ప్రచారం చేసి నా కొడుకుపై కూడా ఆరోపణలు చేశారు. మా వియ్యంకుడి వ్యాపారులపై కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారం మీదే.. తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చు’’ అని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: ముంబై పెళ్లిలోనూ జనసేన గెలుపుపైనే చర్చ

Home Minister Anitha: ఆ కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం..

Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా

Updated Date - Jul 15 , 2024 | 05:14 PM