Share News

CM Chandrababu: ఈనెల 11న విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:59 PM

సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ నెల 11వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది.

CM Chandrababu: ఈనెల 11న విశాఖలో  సీఎం చంద్రబాబు పర్యటన
CM Nara Chandrababu Naidu

విశాఖపట్నం: సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ నెల 11వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏపీ మెడ్ టెక్ జోన్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita) సందర్శించారు. మెడ్ టెక్ జోన్‌లో అధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ,సీపీ శంభబ్రత బాగ్చి , జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నం వస్తున్నారని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. విశాఖకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. 11 తేదీన సీఎం ఉమ్మిడి విశాఖ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఏర్పాట్లు అన్ని పూర్తి అవుతున్నాయని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 10:01 PM