Share News

Liver Problems: మద్యం కన్నా ఎక్కువగా లివర్‌ని డ్యామేజ్ చేసే ఆహార పదార్థాలు ఇవే..

ABN , Publish Date - Aug 30 , 2024 | 07:27 AM

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన రోజువారీ కార్యక్రమాలు అన్ని దానిపైనే ఆధారపడి ఉంటాయి. అలాగే మంచి జీవనశైలితో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకు తగిన విధంగానే వారు ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ తీవ్రంగా కృషి చేస్తుంటారు. అందులో భాగంగానే మద్యం వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి కాలేయం, కిడ్నీలు వంటి అవయవాలను దెబ్బతీస్తాయి. అటువంటి వారు సైతం తమకు తెలియకుండానే లివర్ డ్యామేజ్ చేసే ఆహార పదార్థాలు తరచుగా తింటుంటారు. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం..

ఫ్రెంచ్ ఫ్రైస్..

ఆల్కహాల్ అతిగా తాగడం వల్ల మన కాలేయం దెబ్బతింటుందని అందిరికీ తెలిసిన విషయమే. అయితే మనకు తెలియకుండానే దాన్ని డ్యామేజ్ చేసే ఆహారాన్ని రెగ్యులర్‌గా తింటుంటాం. అందులో ముఖ్యమైనది ఫ్రెంచ్ ఫ్రైస్. పాశ్చాత్య దేశాలకు చెందిన ఈ వంటకం.. ఆధునిక సమాజంలో భారతదేశానికి వచ్చింది. అయితే ఇది ఎక్కువగా ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలు, చిన్నచిన్న పట్టణాలకు సైతం వ్యాపించింది. బంగాళదుంపలను సన్నగా పొడవుగా కత్తిరించి.. కొన్ని పదార్థాలను వాటికి జోడించి బాగా మరిగిన నూనెలో వేయిస్తారు. ఈ వంటకం లివర్‌పై తీవ్ర ప్రభావం చూపించగలదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్రైడ్ చికెన్..

అలాగే ఈ రోజుల్లో చికెన్ ఇష్టపడేవారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్రైడ్ చికెన్ అంటే పడిచస్తారు. అలాంటి వారిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా ఫ్రైడ్ చికెన్ తింటే లివర్ దెబ్బతినడం ఖాయమని చెప్తున్నారు. ఎందుకంటే చికెన్‌ను ఎక్కువగా సేపు నూనెలో వేయిస్తారు. ఇలా అతిగా వేయించిన పదార్థాలు కాలేయంపై ప్రభావం చూపితాయని చెప్తున్నారు.

ఫాస్ట్ ఫుడ్‌..

నగరాలు, పట్టణాలు, గ్రామాలు సహా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కడ చూసిన దర్శనం ఇస్తాయి. ఇక్కడ వినియోగించే పదార్థాలు సైతం కాలేయం ప్రభావం చూపగలవు. ముఖ్యంగా నిల్వ చేసిన సూప్‌లు, ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల కాలేయానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్యాక్ చేసిన ఆహారం..

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు ముఖ్యంగా స్నాక్స్ వంటివి మన కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారం మన లివర్‌కి చాలా ప్రమాదకరం. ఇవి రెగ్యులర్‌గా తినే వారిలో లివర్ త్వరగా అనారోగ్యానికి గురవుతుంది. అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే.. వీటిలోని హానికరమైన పదార్థాలు ఫ్యాటీ లివర్‌కు కారణం అవుతాయి. కాబట్టి మనం ఎలాంటి ఆహారాన్ని తింటున్నామో, దాని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యానికి హాని చేసే ఇలాంటి ఆహారాన్ని తిని అనారోగ్యం కొని తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Aug 30 , 2024 | 07:27 AM