Share News

Parliament Sessions: రాజ్యాంగ ప్రతులతో విపక్షాల నిరసన.. బీజేపీపై తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Jun 24 , 2024 | 02:51 PM

ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.

Parliament Sessions: రాజ్యాంగ ప్రతులతో విపక్షాల నిరసన.. బీజేపీపై తీవ్ర విమర్శలు

ఢిల్లీ: ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని, దానిని కాపాడాలంటూ నేతలు నినాదాలు చేశారు.

బీజేపీ రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ఆరోపించారు. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. 'మోదీజీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈరోజు అన్ని పార్టీల నేతలు ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.బీజేపీ నేతలు గాంధీజీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొడుతున్నారు. మనం రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్లాలి. మోదీ.. ఎమర్జెన్సీ గురించి 100 సార్లు చెబుతారు. ఎమర్జెన్సీ విధించకుండానే ఆయన ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఇలా ఇంకెంత కాలం పాలించాలనుకున్నారు" అని ఖర్గే ప్రశ్నించారు.


రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు..

టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి బీజేపీ.. ప్రోటెం స్పీకర్ నియామకం చేసిందని ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకే నిరసన తెలుపుతున్నామని.. ప్రొటెం స్పీకర్‌ను నియమించిన తీరు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న తమ వెంట ప్రజలు ఉన్నారని.. రానున్న రోజుల్లో దేశ వ్యాప్త ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 02:51 PM