Share News

Pinakini, Janashtabdi trains: 5 నుంచి పినాకిని, జనశతాబ్ది రైళ్లు రద్దు..

ABN , Publish Date - Jul 10 , 2024 | 11:55 AM

విజయవాడ యార్డ్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా పినాకిని, జనశతాబ్ధి రైళ్లను(Pinakini, Janashtabdi trains) రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Pinakini, Janashtabdi trains: 5 నుంచి పినాకిని, జనశతాబ్ది రైళ్లు రద్దు..

చెన్నై: విజయవాడ యార్డ్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా పినాకిని, జనశతాబ్ధి రైళ్లను(Pinakini, Janashtabdi trains) రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.12711 విజయవాడ- చెన్నై సెంట్రల్‌, నెం.12712 చెన్నై సెంట్రల్‌-విజయవాడ పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 5 నుంచి 10వ తేది వరకు పూర్తిగా రద్దు. - నెం.12077 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-విజయవాడ, నెం.12078 విజయవాడ-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 5 నుంచి 10వ తేది వరకు పూర్తిగా రద్దు.

- నెం.17237 బిట్రగుంట- చెన్నై సెంట్రల్‌, నెం.17238 చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 4 నుంచి 11వ తేది వరకు పూర్తిగా రద్దు.


పాక్షిక రద్దు...

- నెం.12760 హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు తాంబరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 2 నుంచి 10వ తేది వరకు వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడకు బదులుగా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లింపు. ఈ రైలుకు నల్గొండ, గుంటూరులో అదనపు హాల్ట్‌.

- నెం.12759 తాంబరం నుంచి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌ వెళ్లే రైలు ఆగస్టు 2 నుంచి 10వ తేది వరకు విజయవాడ, ఖమ్మం, డోర్నకల్‌, మహబాబాబాద్‌ వరంగల్‌, ఖాజీపేటకు బదులుగా తెనాలి, గుంటూరు, పడిగిపల్లి మీదుగా మళ్లింపు. ఈ రైలుకు గుంటూరు, నల్గొండలో అదనపు హాల్ట్‌.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 11:59 AM