Lok Sabha Elections 2024: రాహుల్ గాంధీపై షాకింగ్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి..
ABN , Publish Date - Apr 23 , 2024 | 03:16 PM
Lok Sabha Polls 2024: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Raghul Gandhi) కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 26 తరువాత అమేథీలో(Amethi) పర్యటించాలని యోచిస్తున్నారని, నియోజకవర్గంలో కుల చిచ్చు రగిల్చే కుట్రకు తెరలేపుతున్నారని కేంద్ర మంత్రి..
Lok Sabha Polls 2024: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Raghul Gandhi) కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 26 తరువాత అమేథీలో(Amethi) పర్యటించాలని యోచిస్తున్నారని, నియోజకవర్గంలో కుల చిచ్చు రగిల్చే కుట్రకు తెరలేపుతున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ఏప్రిల్ 26న వాయనాడ్‌లో(Wayanad) ఓటింగ్ తరువాత రాహుల్ గాంధీ అమేథీకి వస్తారు. అమేథీ తన కుటుంబం అని ప్రజలను నమ్మబలుకుతాడు. ఇక్కడి సమాజంలో కుల చిచ్చె పెడతారు.’ అని ఆరోపించారు.
అమేథీని నిర్లక్ష్యం చేశారు..
‘అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆహ్వానాన్ని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తిరస్కరించాయి. కానీ, అమేథీలోని దేవాలయాల చుట్టూ రాహుల్ తిరుగుతారు. అందుకే.. రాహుల్, కాంగ్రెస్ తీరుతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.’ అని స్మృతి ఇరానీ అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో ఏనాడూ అమేథీ సమస్యలను ప్రస్తావించలేదని, తరచూ సమావేశాలకు గైర్హాజరయ్యేవారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ‘కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు, యూపీలో ఎస్పీతో పొత్తుతో సహా 15 సంవత్సరాలు ఎంపీగా పనిచేసినప్పటికీ.. అమేథీ వాసులకు తాగునీరు వంటి అవసరమైన సౌకర్యాలు అంతంతమాత్రంగానే కల్పించారు’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాతే అమేథీ ప్రజలకు, వారి ఇళ్లకు సాధారణ తాగునీరు సరఫరా ప్రారంభమైందన్నారు.
ఇదికూడా చదవండి: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!
ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్..
కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీని ఓడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థినే ప్రకటించలేదు. అయితే, స్థానిక పార్టీ కార్యకర్తలు మాత్రం రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచే పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసారి రాహుల్ గాంధీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అంటున్నారు. అయితే, మిగిలిన సీట్ల అభ్యర్థిత్వం ప్రకటించే విషయాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు వదిలేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మిగిలినట్ల సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: దాంతో పోల్చితే బొటనవేలు కోసకున్న బాధ పెద్దది కాదన్న కోవూరి లక్ష్మీ
ఘోర పరాజయం..
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ ఘోర పరాజయం పాలయ్యారు. వరుసగా మూడుసార్లు గెలిచిన రాహుల్ గాంధీకి.. 2019లో స్మృతి ఇరానీ చెక్ పెట్టారు. రాహుల్ గాంధీపై స్మృతీ ఇరానీ గెలుపొందారు. ఇక ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో64 స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షం అప్నాదళ్(ఎస్) విజయం సాధించాయి. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ ‘మహాఘటబంధన్’ ఘోర పరాజయం మూటకట్టుకుని కేవలం 15 సీట్లలో మాత్రమే గెలుపొందాయి.
ఇదికూడా చదవండి: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!
ఏప్రిల్ 26న వయనాడ్‌లో ఎన్నికలు..
లోక్‌సభ ఎన్నికలు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరగనున్నాయి. రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బిహార్, ఛత్తీస్ఘర్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్ము&కశ్మీర్ రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో వాయనాడ్‌లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుండగా.. అమెథీ లోక్‌సభ స్థానానికి మే 20న పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికలు 2024 ఫలితాలు జూన్ 4వ తేదీన ప్రకటించనున్నారు.