Share News

Viral Video: ఇదేం ఫేస్ ప్యాక్‌రా బాబోయ్.. మహిళ మొఖంపై గుడ్డు పగుల గొట్టి.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Aug 30 , 2024 | 09:37 PM

ప్రస్తుతం యువతో పాటూ అన్ని వయసుల వారు అందంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బ్యూటీఫార్లర్స్‌‌లో వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. వీరి ఆసక్తిని గమనించిన బ్యూటీఫార్లర్స్ నిర్వాహకులు కూడా ఏవేవో ఫేస్ ప్యాక్‌ల పేరుతో..

Viral Video: ఇదేం ఫేస్ ప్యాక్‌రా బాబోయ్.. మహిళ మొఖంపై గుడ్డు పగుల గొట్టి.. చివరకు చూస్తే..

ప్రస్తుతం యువతో పాటూ అన్ని వయసుల వారు అందంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బ్యూటీఫార్లర్స్‌‌లో వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. వీరి ఆసక్తిని గమనించిన బ్యూటీఫార్లర్స్ నిర్వాహకులు కూడా ఏవేవో ఫేస్ ప్యాక్‌ల పేరుతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ మొఖంపై గుడ్డు పగుల గొట్టి ఫేస్ ప్యాక్ వేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫేస్ ప్యాక్ కోసం బ్యూటీఫార్లర్‌కు వెళ్తుంది. ఆమెను పడుకోబెట్టిన యువతి.. తల చుట్టూ గుడ్డ చుట్టిన తర్వాత ముఖంపై గుడ్డు పగులగొడుతుంది. అందులోని సొనను ముఖంపై పరిచేస్తుంది. గుడ్డు పగులగొట్టగానే సదరు మహిళ.. గట్టిగా కళ్లు మూసుకుంటుంది.

Viral Video: బలవంతంగా ఇంట్లోకి వెళ్లాలని చూసిన దొంగ.. ఆ వెంటనే కేకలు పెడుతూ పరుగులు.. అసలేం జరిగిందో చూస్తే..


గుడ్డు పగులగొట్టిన యవతి.. ముఖంపై చేతులతో (Face pack with egg) మొత్తం మసాజ్ చేస్తుంది. ఇలా గుడ్డు సొనను ముఖంపై చాలా సేపు రుద్దేస్తుంది. ఆ తర్వాత టిష్యూ పేపర్లతో శుభ్రం చేస్తుంది. ఇలా ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత.. ఆ మహిళ ‘‘హమ్మయ్య.. మొత్తానికి ఫేస్ ప్యాక్ పని అయిపోయింది’’.. అన్నట్లుగా ఊపిరి పీల్చుకుంటుంది. చివరకు బ్యూటీఫార్లర్ నిర్వాకురాలు ఆమె నోటిలో స్వీటు తినిపిస్తుంది.

Viral Video: వరదల్లో షెడ్డులోకి కొట్టుకొచ్చిన మొసలి.. వెళ్తూ వెళ్తూ ఏం చేసిందో చూడండి..


ఇలా ఆ మహిళకు గుడ్డు మసాజ్ చేసి పంపిస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదెక్కడి ఫేస్‌ప్యాక్‌రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘అందులో ఉప్పు, కారం మర్చిపోయారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 92 వేలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. తన మానాన తాను వెళ్తుంటే.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 30 , 2024 | 09:37 PM