Share News

Viral Video: వరదల్లో షెడ్డులోకి కొట్టుకొచ్చిన మొసలి.. వెళ్తూ వెళ్తూ ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Aug 30 , 2024 | 06:59 PM

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా ఏకంగా ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి. దీంతో ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. మరోవైపు వరదల్లో..

Viral Video: వరదల్లో షెడ్డులోకి కొట్టుకొచ్చిన మొసలి.. వెళ్తూ వెళ్తూ ఏం చేసిందో చూడండి..
Crocodile In Flood Water

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా ఏకంగా ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి. దీంతో ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. మరోవైపు వరదల్లో కొట్టుకొస్తున్న మొసళ్లు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, బీహార్‌లో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరదల్లో ఓ పెద్ద మొసలి నివాస ప్రాంతంలోని షెడ్డులోకి కొట్టుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం గుజరాత్‌లోని (Gujarat) ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, రాజ్‌కోట్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరద నీరు ఊర్లనే మొంచెత్తుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడోదరలో కురిసిన భారీ వర్షానికి (heavy rain) వరద నీరు పోటెత్తింది.

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. తన మానాన తాను వెళ్తుంటే.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..


గ్రామాల్లోకి వరద నీరు రావడంతో పాటూ రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. అలాగే చాలా ఇళ్లు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఇదిలావుండగా, వరద కారణంగా పెద్ద పెద్ద మొసళ్లు సైతం జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఇటీవల వడోదర నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరద నీటిలో ఓ పెద్ద మొసలి జనవాసాల్లోని షెడ్డులోకి కొట్టుకొచ్చింది. అయితే షెడ్ లోపలికి వెళ్లిన మొసలి.. చివరకు (crocodile attacked a dog) అక్కడ ఉన్న ఓ కుక్కపై దాడి చేసింది.

Viral Video: సడన్‌గా ట్రక్కుకు అడ్డుగా వచ్చిన కారు.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..


కుక్కను నోటకరుచుకుని బయటికి లాక్కెళ్లిపోవడాన్ని చుట్టూ ఉన్న వారు చూసి షాక్ అయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అధికారులు సహాయక చర్యలు చేపట్టాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదేంట్రా బాబోయ్.. రైల్వే గేట్‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Aug 30 , 2024 | 06:59 PM