Share News

Viral Video: బార్డర్‌లో సైనికులకే కాదు.. జింకలకూ పోటాపోటీ.. కంచెకు రెండు వైపులా వాటి నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:13 AM

దేశ రక్షణలో భాగంగా సైనికులు సరిహద్దులో నిత్యం కాపలా కాస్తుంటారు. ఏదైనా ఆపద తలెత్తితే తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ పోరాటం చేస్తుంటారు. ఇక భారత్- పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాలు దువ్వాలని చూసే..

Viral Video: బార్డర్‌లో సైనికులకే కాదు.. జింకలకూ పోటాపోటీ.. కంచెకు రెండు వైపులా వాటి నిర్వాకం చూస్తే..

దేశ రక్షణలో భాగంగా సైనికులు సరిహద్దులో నిత్యం కాపలా కాస్తుంటారు. ఏదైనా ఆపద తలెత్తితే తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ పోరాటం చేస్తుంటారు. ఇక భారత్- పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాలు దువ్వాలని చూసే పాకిస్థాన్ సైనికులు మన సైనికులు గట్టిగా సమాధానం ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఇదే సరిహద్దులో రెండు జింకల మధ్య చోటు చేసుకున్న ఫైట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారత్- పాకిస్థాన్ సరిహద్దులో (India-Pakistan border) చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరిహద్దులోని కంచె వద్ద ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. అనుకోకుండా తారసడిన రెండు జింకల మధ్య ఉన్నట్టుండి గొడవ జరుగుతుంది.

Viral Video: ఇంట్లోకి దూరి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. కాస్త దూరం వెళ్లగానే.. ఒక్క అరుపుతో.. చివరకు..


కంచెకు అటూ, ఇటూ ఉన్న జింకలు ఒక్కసారిగా ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాయి. చాలా సేపు వరకూ రెండు జింకలూ (fight between deer) ఒకదానికొకటి తలలతో ఢీకొట్టుకున్నాయి. చాలా సేపు అలా పోట్లాడుకుంటూనే ఉన్నాయి. మధ్యలో ఓ జింక పక్కకు వెళ్లిపోతుంది. అయితే మళ్లీ దానికి కోపం కట్టలు తెంచుకుందో ఏమో గానీ.. వేగంగా కంచె వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి, మళ్లీ ఆ జింకతో పోరాడుతుంది. ఇలా వాటి మధ్య చాలా సేపు ఫైట్ నడుస్తుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న సైనికులు గమనించి తమ కెమెరాల్లో బంధించారు.

Viral Video: దండ వేస్తుండగా ఇలా చేశాడేంటీ.. చివరి నిమిషంలో వధువుకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..


ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సైనికులకే కాదు.. జింకలకూ అదే స్థాయిలో ఫైట్ నడుస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘పాకిస్థాన్ జింక కంటే ఇండియన్ జింకే పవర్‌ఫుల్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ అమ్మాయిలు ఏం చేశారో చూడండి..

Updated Date - Jul 30 , 2024 | 11:17 AM