Share News

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ అమ్మాయిలు ఏం చేశారో చూడండి..

ABN , Publish Date - Jul 30 , 2024 | 10:32 AM

కొందరు బైకులతో రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తుంటారు. మరికొందరు అధిక వేగంతో వాహనాలు నడుపుతూ ఎదుటివారికి ప్రమాదకరంగా మారుతుంటారు. ఇంకొందరైతే అవగాహన లేమితో వాహనాలు నడుపుతూ చివరకు...

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ అమ్మాయిలు ఏం చేశారో చూడండి..

కొందరు బైకులతో రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తుంటారు. మరికొందరు అధిక వేగంతో వాహనాలు నడుపుతూ ఎదుటివారికి ప్రమాదకరంగా మారుతుంటారు. ఇంకొందరైతే అవగాహన లేమితో వాహనాలు నడుపుతూ చివరకు ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి సమాయాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముగ్గురు యవకుతులు స్కూటీలో వెళ్తుండగా.. బ్రేక్ వేయాల్సిన సమయంలో వేయలేదు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు యువతులు (young women) స్కూటీపై వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో ఓ మలుపు వద్ద ఊహించని ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా ఎదురుగా మురుగు గుంట కనిపించింది. దీంతో బ్రేకులు వేయాల్సిన వారు అందుకు విరుద్ధంగా యాక్సిలరేటర్ తిప్పారు. దీంతో వాహనం వేగంగా వెళ్లి మురుగు గుంటలో పడిపోయింది.

Viral Video: ఇంట్లోకి దూరి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. కాస్త దూరం వెళ్లగానే.. ఒక్క అరుపుతో.. చివరకు..


ఆ ముగ్గురు యువతులు మురుగులో (young wome fell in the drain) మునిగిపోయారు. పైకి లేచాక చూస్తే ముగ్గురూ మొత్తం నలుపు రంగులోకి మారిపోయారు. అక్కడే ఉన్న కొందరు పరుగెత్తుకుంటూ వచ్చి వారిని రక్షించారు. గుంటలో పడిపోయిన స్కూటీని బయటికి తీశారు. ఫైనల్‌గా రోడ్డుపై నిలబడ్డ ముగ్గురు యువతులూ నల్లగా మారిపోవడం చూసి చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా నవ్వుకున్నారు. కొందరు అయ్యో పాపం.. అంటూ వారిపై జాలి చూపించారు.

Viral Video: ఎద్దు విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. మేడపై నుంచి ఒక్కసారిగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన ఉంటేనే రోడ్డుపైకి రావాలి’’.. అంటూ కొందరు, ‘‘గాయాలేమీ కాలేదు.. థ్యాంక్స్ గాడ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దండ వేస్తుండగా ఇలా చేశాడేంటీ.. చివరి నిమిషంలో వధువుకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..

Updated Date - Jul 30 , 2024 | 10:32 AM