Share News

Gold Viral Video: వామ్మో! ఇదెలా సాధ్యం.. రాళ్ల కింద నుంచి బంగారాన్ని ఎలా తీస్తున్నారో చూడండి..

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:09 PM

బంగారు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చాలా మంది దీన్ని తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. ఈ విషయం పక్కన పెడితే.. చాలా మందికి బంగారాన్ని ఎలా వెలికితీస్తారనే సందేహం ఉంటుంది. ప్రస్తుతం...

Gold Viral Video: వామ్మో! ఇదెలా సాధ్యం.. రాళ్ల కింద నుంచి బంగారాన్ని ఎలా తీస్తున్నారో చూడండి..

బంగారు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చాలా మంది దీన్ని తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. ఈ విషయం పక్కన పెడితే.. చాలా మందికి బంగారాన్ని ఎలా వెలికితీస్తారనే సందేహం ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. బంగారు వెలికితీతకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇద్దరు వ్యక్తులు రాళ్లు తొలగించి, బంగారాన్ని తొలగించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో! ఇదెలా సాధ్యం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బంగారం కోసం ఇద్దరు వ్యక్తులు ఓ కొండ ప్రాంతానికి వెళ్లి వెతుకుతుంటారు. ఈ క్రమంలో చివరకు వారు కొండపై ఓ పెద్ద రాయిని తొలగిస్తారు. రాయిని సగం చీల్చి పక్కకు తొలగిస్తారు. తర్వాత రాయి కింద ఉన్న మట్టిని తొలగిస్తారు. చివరగా దాని అడుగున ఉన్న మట్టి, చిన్న చిన్న రాళ్లను మొత్తం పక్కకు తీసి, నీళ్లలో పోస్తారు. ఫైనల్‌గా దాన్ని వడబోయగా అడుగున చిన్న చిన్న బంగారు ముక్కలు కనిపిస్తాయి. ఇలా ఎట్టకేలకు వారు (Extracting gold from soil) మట్టి రాళ్ల నుంచి బంగారాన్ని వెలికితీస్తారు.

Watch Video: ఈ టాటూ ఆర్టిస్ట్ ఒక్క క్షణం ఆలస్యం చేసినా.. ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో చూడండి..

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ‘‘వామ్మో! వీళ్లేంటీ బంగారాన్ని ఇంత ఈజీగా తీస్తున్నారు’’.. అంటూ కొందరు, ‘‘అనుమతి లేకుండా ఇలా పర్యావరణాన్ని పాడు చేయడం నేరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మానవాళికి కనువిప్పు కలిగించిన పులి.. ఇంతకీ అది చేసిన పనేంటో మీరే చూడండి..

Updated Date - Feb 15 , 2024 | 03:19 PM