Share News

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ప్రియురాలు.. చివరికి వరుడు ఎదురుగా ఉండగానే..

ABN , Publish Date - May 18 , 2024 | 05:20 PM

పెళ్లిళ్లలో చోటు చేసుకునే ప్రతి చిన్న ఘటనే నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటుంది. వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొన్నిసార్లు అనుకోకుండానే అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. .

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ప్రియురాలు.. చివరికి వరుడు ఎదురుగా ఉండగానే..

పెళ్లిళ్లలో చోటు చేసుకునే ప్రతి చిన్న ఘటనే నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటుంది. వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొన్నిసార్లు అనుకోకుండానే అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మొత్తం మీద ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీనంతలా ఉన్నా కూడా ఇలాంటి వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి పెళ్లి దుస్తుల్లో పెళ్లి వేదికపైకి చేరుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండడి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వధూవరులు వేదికపై ఉండగా.. వరుడి ప్రియురాలు పెళ్లి దుస్తుల్లో అక్కడికి చేరుకుంటుంది. వస్తూ వస్తూ మెడలో దండ కూడా వేసుకుని వస్తుంది. ఆమెను చూడగానే వధువు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ క్రమంలో ఇద్దరి (woman quarreled with the bride) మధ్య గొడవ మొదలవుతుంది.

Viral Video: కారు కడగడం ఓకే గానీ.. మరీ విచిత్రంగా.. నీళ్లు అలా పోయడం ఏంట్రా బాబోయ్..


వరుడు చూస్తుండగానే ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. వారిద్దరూ గొడవ పడడం చూసి వరుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అలాగే చూస్తుండిపోతాడు. వారిద్దరూ మగవాళ్ల తరహాలో గొడపపడుతూ అటూ ఇటూ తోసుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తారు. మధ్యలో వరుడు కలుగజేసుకుని వారిని విడిపించే ప్రయత్నం చేసినా.. వారు మాత్రం పట్టించుకోకుండా గొడవపడుతూనే ఉంటారు.

Viral Video: విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. జనాల మధ్యలో ఓ వ్యక్తి లాగి మరీ..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వరుడికి పెద్ద కష్టమే వచ్చిందే’’.. అంటూ కొందరు, ‘‘సినిమా సీన్‌ను తలదన్నేలా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘వైరల్ అయ్యేందుకు కావాలనే ఇలా చేశారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 93 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నదిలో కూర్చుని గిటార్ వాయిస్తున్న యువకుడు.. సడన్‌గా దగ్గరికి వచ్చిన కొండచిలువ.. చివరకు..

Updated Date - May 18 , 2024 | 05:20 PM