Viral Video: వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. నడి రోడ్డుపై కింగ్ కోబ్రాతో ఫన్నీ గేమ్స్..
ABN , Publish Date - Dec 06 , 2024 | 08:08 PM
పాము, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పాములతో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. మరికొందరు కింగ్ కోబ్రా వంటి ప్రమాదకర పాములతో కూడా ఫన్నీ గేమ్స్ ఆడుతుంటారు. ఇలాంటి..
పాము, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పాములతో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. మరికొందరు కింగ్ కోబ్రా వంటి ప్రమాదకర పాములతో కూడా ఫన్నీ గేమ్స్ ఆడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి కూడా ఇలాంటి పనే చేశాడు. నడి రోడ్డుపై పొడవైన కింగ్ కోబ్రాతో ఆడుకున్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా రోడ్డుపైకి వస్తుంది. దీన్ని చూడగానే వాహనాదారులంతా రోడ్డుపై నిలుపుకొంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ధైర్యంగా దాని వద్దకు వెళ్తాడు. వెళ్లడమే కాదు ఏకంగా దాని తోక పట్టుకుని పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో కోబ్రా అతన్ని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది.
Viral: ఇంత చిన్న దుకాణంపై అంత పెద్ద ఇల్లేంట్రా బాబోయ్.. ఈ ఇంజినీర్ తెలివి మామూలుగా లేదుగా..
అయినా ఆ వ్యక్తి పాము తోక వదలకుండా (man caught king cobra on the road) దాన్ని అటూ, ఇటూ తిప్పుతూ కాటు నుంచి తప్పించుకుంటాడు. ఇలా పామును విసురుతూ ఫన్నీ గేమ్స్ ఆడతాడు. ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అయితే అతను చాకచక్యంగా ప్రవర్తించి పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. కింగ్ కోబ్రాతో ఇతను చేస్తున్న నిర్వాకం చూసి వాహనదారులంతా షాక్ అయ్యారు.
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. జాయింట్ వీల్ నుంచి జారిన యువతి.. చివరకు ఏం జరిగిందంటే..
కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ.. చూస్తుంటేనే బయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘బ్రదర్ మీరు అనవరంగా దాన్ని భయపెడుతున్నారు.. దాని దారిన అది వెళల్నివ్వండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 94 వేలకు పైగా లైక్‌లు, 5.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఖడ్గమృగంతో అంత ఈజీ కాదు.. సింహాల పరిస్థితి చివరకు ఏమైందంటే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..