Viral Video: ఫోన్ బిజీలో భర్తకే షాక్ ఇచ్చిందిగా.. పెట్రోల్ బంక్‌లో మరో బైక్ ఎక్కడంతో.. చివరకు..
ABN , Publish Date - Dec 05 , 2024 | 08:00 PM
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లల నుంచి పెద్దలే కాకుండా చివరకు వృద్ధులు కూడా ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొందరైతే ఫోన్ మాయలో పడి చివరకు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొందరు మహిళలు ఫోన్ మాట్లాడుతూ తమ పిల్లలను ప్రమాదంలో పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇలాంటి..
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లల నుంచి పెద్దలే కాకుండా చివరకు వృద్ధులు కూడా ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొందరైతే ఫోన్ మాయలో పడి చివరకు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొందరు మహిళలు ఫోన్ మాట్లాడుతూ తమ పిల్లలను ప్రమాదంలో పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పెట్రోల్ బంక్‌లో తన భర్తకు షాక్ ఇచ్చింది. ఫోన్ మాట్లాడుతూ వేరే వ్యక్తి బైక్ ఎక్కేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) తన భర్తతో పాటూ బైకుపై వెళ్తోంది. అయితే మధ్యలో ఆ వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్‌లోకి వెళ్లాడు. పెట్రోల్ కొట్టించుకునే సమయంలో అతడి భార్య బండి దిగి ఫోన్ మాట్లాడుకుంటూ (Wife talking on the phone) నడుచుకుంటూ దూరంగా వెళ్లి నిలబడింది. ఆమె భర్తకు ముందు వైపు మరో వ్యక్తి కూడా తన బైక్‌కు పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు.
Viral Video: ఇలా ఎవరైనా పడుకుంటారా.. మొత్తానికి ఫైర్ సిబ్బందికే షాక్ ఇచ్చాడుగా..
అయితే ఈ సమయంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతున్న ఆ మహిళ.. అపరిచిత వ్యక్తి బైకు ఎక్కి కూర్చుంది. అతను కూడా ఫోన్ ధ్యాసలో పడి ఆమెను ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఇది గమనించిన ఆమె భర్త అక్కడే పెట్రోల్ పట్టించుకుంటూ ఉన్నాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
Viral Video: ఈ వధువేంటీ మరీ విచిత్రంగా ఉందే.. మంటపం కూడా చేరకముందే.. అందరి ముందూ..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘భర్త, సోదరుడితో కలిసి బాగానే యాక్టింగ్ చేసింది’’.. అంటూ మరికొందరు, ‘‘పెట్రోల్ బంక్‌ల వద్ద ఫోన్లు మాట్లాడటం ప్రమాదం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 1,72 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..