Share News

Viral Video: ఖడ్గమృగంతో అంత ఈజీ కాదు.. సింహాల పరిస్థితి చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:10 PM

అడవికి రాజు అయిన సింహం.. పేరుకు తగ్గట్టుగానే వేటలోనూ అదే రాజసం ప్రదర్శిస్తుంది. సింగల్‌గా వెళ్లి పెద్ద పెద్ద జంతువులను సులభంగా వేటాడేస్తుంటుంది. ఒక్కాసారి వేటకు దిగిదంటే అవతల ఎలాంటి జంతువున్నా సరే ఇట్టే దానికి ఆహారమైపోవాల్సిందే. అయితే అలాంటి సింహానికి కూడా కొన్నిసార్లు ..

Viral Video: ఖడ్గమృగంతో అంత ఈజీ కాదు.. సింహాల పరిస్థితి చివరకు ఏమైందంటే..

అడవికి రాజు అయిన సింహం.. పేరుకు తగ్గట్టుగానే వేటలోనూ అదే రాజసం ప్రదర్శిస్తుంది. సింగల్‌గా వెళ్లి పెద్ద పెద్ద జంతువులను సులభంగా వేటాడేస్తుంటుంది. ఒక్కాసారి వేటకు దిగిదంటే అవతల ఎలాంటి జంతువున్నా సరే ఇట్టే దానికి ఆహారమైపోవాల్సిందే. అయితే అలాంటి సింహానికి కూడా కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. చాలా జంతువులు వాటిపై ఎదరుదాడి చేసి తోకముడిచేలా చేస్తుంటాయి. ఏనుగు, ఎలుగుబంటి తదితర జంతువులు సింహాలపై పైచేయి సాధించడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాడి చేయబోయిన సింహానికి ఖడ్గమృగం పెద్ద షాక్ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న రెండు సింహాలు వేట కోసం వెతుకుతూ ఉంటాయి. ఇంతలో వాటికి ఓ పెద్ద ఖడ్గమృగం కనిపిస్తుంది. దాన్ని వేటాడటం కష్టమని తెలిసినా ఎలాగైనా చంపేయాలని చూస్తాయి. వాటిలో ఓ సింహం ఖడ్గమృగానికి ఎదురుగా వెళ్లి తన పంజాతో కిందపడేయాలని చూస్తుంది. అయితే సింహం దాడితో అలెర్ట్ అయిన ఖడ్గమృగం తన తలతో సింహాన్ని దూరంగా తోసేస్తుంది.

Viral Video: నిజమైన ‘హార్ట్ బ్రేకింగ్’ అంటే ఇదేనేమో.. మొత్తానికి ఈ వధూవరులు సినిమాను సీన్‌ను మరిపించారుగా..


ఆపై ఖడ్గమృగం.. ఆ సింహాలపై దాడి చేసి (Rhino attacked lions) చంపేయాలని చూస్తుంది. అయితే ఆ రెండూ తెలివిగా దూరంగా పారిపోయి తప్పించుకుంటాయి. ఖడ్గమృగం పవర్ తెలుసుకున్న ఆ సింహాలు.. దాని జోలికి వెళ్లడానికి జంకుతాయి. ఇలా ఈ ఖడ్గమృగం.. ఆ రెండు సింహాలకు చావు భయం ఎలా ఉంటుందో చూపించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పర్యాటకులు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: కోబ్రా కాటేస్తున్నా పట్టించుకోని కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘సింహాలకు చుక్కలు చూపించిన ఖడ్గమృగం’’.. అంటూ కొందరు, ‘‘ఖడ్గమృగం పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2700కి పైగా లైక్‌లు, 98 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వరద నీటిలో బైకు డ్రైవింగ్.. తీరా బయటికి వచ్చిన తర్వాత చూడగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 06 , 2024 | 04:10 PM