Share News

Viral Video: కోబ్రా కాటేస్తున్నా పట్టించుకోని కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Dec 05 , 2024 | 09:15 PM

కోతి, పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సైలెంట్‌గా కూర్చున్న కోతి వద్దకు వెళ్లే పాములు.. బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నించినా కోతులు భయపడకుండా వాటిని తరిమికొట్టడం చూశాం. మరికొన్నిసార్లు కొన్ని కోతులు పాములతో ఆటలు ఆడుకోవడం కూడా చూశాం. తాజాగా..

Viral Video: కోబ్రా కాటేస్తున్నా పట్టించుకోని కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

కోతి, పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సైలెంట్‌గా కూర్చున్న కోతి వద్దకు వెళ్లే పాములు.. బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నించినా కోతులు భయపడకుండా వాటిని తరిమికొట్టడం చూశాం. మరికొన్నిసార్లు కొన్ని కోతులు పాములతో ఆటలు ఆడుకోవడం కూడా చూశాం. తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోబ్రా కాటేస్తున్న కోతి పట్టించుకోలేదు. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కోతిని తాడుతో కట్టేసి పొలంలో కూర్చోబెట్టాడు. తర్వాత దాని వద్దకు ఓ కోబ్రాను వదిలాడు. కోతి వద్దకు వెళ్లిన కోబ్రా.. (cobra hissed at a monkey) పడగ విప్పి బుసలుకొట్టింది. అయినా కోతి దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన ధ్యాసలో తాను ఉండిపోయింది. ఈ క్రమంలో కోబ్రా కోతిని కాటేసింది.

Optical illusion: మీరు నిజంగా చురుకైన వారైతే.. ఇందులో దాక్కున్న కారును 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అయినా కోతి మాత్రం ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా పంట పొలంలో తినుబండారాల కోసం వెతుకుతోంది. ఇలా పాము పదే పదే బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నిస్తున్నా.. కోతి మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలా చాలా సేపటి తర్వాత పాము వైపు చూసిన కోతి.. తల కింద పట్టుకుని మెడలో దండలా వేసుకుంటుంది. పాము వెళ్లిపోతున్నా లాక్కుని మరీ మెడలో వేసుకుంటుంది. ఇలా అంతటి ప్రమాదకరమైన పాముతో కూడా ఆ కోతి ఆడుకోవడం చూసి అంతా షాక్ అవుతున్నారు.

Viral Video: ఫోన్ బిజీలో భర్తకే షాక్ ఇచ్చిందిగా.. పెట్రోల్ బంక్‌లో మరో బైక్ ఎక్కడంతో.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోతిని కట్టేసి ఇలా వేడుక చూస్తున్న ఆ వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇలా జంతువులను హింసించడం నేరం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లు, 5.6 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలా ఎవరైనా పడుకుంటారా.. మొత్తానికి ఫైర్ సిబ్బందికే షాక్ ఇచ్చాడుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 05 , 2024 | 09:15 PM