Share News

Viral Video: బాబోయ్.. ఒట్టి చేతులతో సమోసాలు వేయించి.. చివరకు మరుగుతున్న నూనెతో ఏం చేశాడో చూస్తే..

ABN , Publish Date - Aug 11 , 2024 | 12:40 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సమోసాలు వేయిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా.. సమోసాలు ఇతను ఎలా వేయిస్తున్నాడో చూస్తే షాక్ అవుతారు. సదరు వ్యక్తి స్టూలుపై కూర్చుని తాపీగా..

Viral Video: బాబోయ్.. ఒట్టి చేతులతో సమోసాలు వేయించి.. చివరకు మరుగుతున్న నూనెతో ఏం చేశాడో చూస్తే..

చాలా మందికి అనితరసాధ్యం అనుకున్నది.. కొందరికి ఈజీగా మారిపోతుంటుంది. ఎవరూ చేయలేని పనులను కొందరు ఎంతో సులభంగా చేయడం చూస్తుంటాం. చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ ఆశ్చర్యపరిచే వారు కొందరైతే.. మరికొందరు తమ రోజు వారీ పనులనే సరికొత్తగా చేసేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఒట్టి చేతులో సలాసలా కాగుతున్న నూనెలో సమోసాలు వేయించాడు. చివరకు ఏం చేశాడో చూస్తే మీరే షాక్ అవుతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సమోసాలు వేయిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా.. సమోసాలు ఇతను ఎలా వేయిస్తున్నాడో చూస్తే షాక్ అవుతారు. సదరు వ్యక్తి స్టూలుపై కూర్చుని తాపీగా సమోసాలను సలాసలా (man frying samosas with his hands in oil) కాగుతున్న నూనెలో వేయిస్తుంటాడు. అయితే మధ్యలో ఉన్నట్టుండి అతను చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు.

Viral Video: సబ్‌మెరైన్‌లా మారిన ట్రాక్టర్.. నీటిలోకి వెళ్లగానే షాకింగ్ సీన్.. చివరకు చూస్తే..


సమోసాలను అటూ ఇటూ తిప్పడానికి గరిటెకు బదులుగా ఏకంగా తన చేతినే పెట్టేస్తాడు. నూనెలో చేతిని ముంచి సమోసాలను అటూ, ఇటూ కదుపుతాడు. అంతటితో ఆగకుండా ఆ తర్వాత ఓ చిన్న పాన్‌లోకి మరుగుతున్న నూనెకు తీసుకుంటాడు. దాన్ని చేతిపై పోసుకుని (man washing his face with hot oil) ముఖం కడుక్కుంటాడు. సమోసాలను చేతులతో వేయించడమే కష్టం అనుకుంటే చివరకు వేడి వేడి నూనెతో ముఖం కడుక్కున్న ఇతడిని చూసి అంతా షాక్ అవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో.. మొసళ్ల గుంపు మధ్యలో వ్యక్తి వాకింగ్.. కాలు మోపగానే అవి చేసిన పని చూడండి..


ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతన్ని నరకంలో వేడి వేడి నూనెలో వేయించడం వీలు కాదేమో’’.., ‘‘ఇతన్ని చూస్తే యుముడు కూడా భయపడతాడేమో’’.., ‘‘అది నూనె అనుకున్నావా.. లేక ఫేస్ వాష్ అనుకున్నావా’’.., ‘‘నరకంలో వేడి నూనెలో జలకాలు ఆడతాడేమో’’.., ‘‘ఇతను ఎన్నిపాపాలు చేసినా యుముడు శిక్షించలేడు’’... అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..

Updated Date - Aug 11 , 2024 | 12:40 PM