Share News

Viral Video: దూడకు జన్మనిచ్చిన గేదె.. అంతలోనే చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:41 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కడుపుతో ఉన్న ఓ గేదె దూడకు జన్మనిస్తుంది. దూడ పుట్టగానే గేదె దాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. కాస్త దూరంలో పొంచి ఉన్న కొన్ని సింహాలకు ఈ గేదె కంటపడుతుంది. వెంటనే..

Viral Video: దూడకు జన్మనిచ్చిన గేదె.. అంతలోనే చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

బిడ్డను కాపాడుకోవడానికి తల్లి తన ప్రాణాలను సైతం అడ్డుపెడుతుంది. అవసరమైతే తన ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ తన పిల్లలను రక్షించుకుంటుంది. అందుకే తల్లిని మించిన దైవం లేదని అంటూ ఉంటాం. తల్లి ప్రేమను మనుషుల్లో ఎలా ఉంటుందో.. జంతువుల్లో అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ గెద దూడకు జన్మనిచ్చిన సమయంలోనే సింహాలు దాన్ని చుట్టుముట్టాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కడుపుతో ఉన్న ఓ గేదె దూడకు జన్మనిస్తుంది. దూడ పుట్టగానే గేదె దాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. కాస్త దూరంలో పొంచి ఉన్న కొన్ని సింహాలకు ఈ గేదె కంటపడుతుంది. వెంటనే అక్కడికి వచ్చి దూడపై (Lion attack on calf) దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి.

Viral Video: కారుపై ఎల్‌ఈడీ స్క్రీన్ పెట్టారనుకుంటే పొరపాటు పడ్డట్లే.. దగ్గరికి వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..


అయితే అక్కడే ఉన్న గేదె.. తన బిడ్డను రక్షించుకునే క్రమంలో సింహాలపైకి దూకుతుంది. చుట్టు ముట్టిన సింహాలు ఎలాగైనా దూడను లాక్కెళ్లాలని చూస్తుండగా.. గేదె వాటిని ధైర్యంగా (buffalo chased away lions) ఎదుర్కొంటూ దూరంగా తరిమేస్తోంది. ఇలా చాలా సేపు సింహాలను తన దూడ వద్దకు రాకుండా అడ్డుకోవడంలో తీవ్రంగా శ్రిమించింది. గేదె ఆవేశం చూసి సింహాలు కూడా దగ్గరికి వచ్చేందుకు సాహసించలేదు.

Viral Video: బైక్ అంటేనే భయం పుట్టేలా చేశాడుగా.. వెనుక కూర్చున్న ఈ యువతి పరిస్థితి చూడండి..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ ముందు సింహం కూడా తోక ముడవాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ గేదె ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వావ్.. కేక్ కటింగ్ మామూలుగా లేదుగా.. మొత్తానికి ఏటీఎంలా మార్చేశారుగా...


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2024 | 12:41 PM