Share News

Viral Video: కుక్కపిల్లను పట్టుకున్న మొసలి.. రక్షించడానికి వెళ్లిన యజమాని.. చివరకు రజనీ స్టైల్లో..

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:06 PM

మొసళ్లు ఒక్కసారి టార్గెట్ చేశాయంటే.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం ఏ జంతువు వల్లా సాధ్యం కాదు. వాటి దాడి అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టే వాటి జోలికి వెళ్లేందుకు ఏ జంతువూ సాహసించదు. అయితే..

Viral Video: కుక్కపిల్లను పట్టుకున్న మొసలి.. రక్షించడానికి వెళ్లిన యజమాని.. చివరకు రజనీ స్టైల్లో..

మొసళ్లు ఒక్కసారి టార్గెట్ చేశాయంటే.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం ఏ జంతువు వల్లా సాధ్యం కాదు. వాటి దాడి అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టే వాటి జోలికి వెళ్లేందుకు ఏ జంతువూ సాహసించదు. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కొన్ని జంతువులు మొసళ్ల దాడి నుంచి లక్కీగా బయటపడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి కుక్క పిల్లపై దాడి చేసింది. దాన్ని రక్షించడానికి వెళ్లిన యజమాని చివరకు ఏం చేశాడో మీరే చూడండి...


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్ల మొసలి కుక్క పిల్లపై (Crocodile attack on puppy) దాడి చేసి పట్టుకుంటుంది. దాన్నుంచి విడిపించుకోవడానికి కుక్క పిల్ల ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ దాని వల్ల సాధ్యం కాదు. చివరకు కుక్క పిల్లను లాక్కుని నీటిలోకి వెళ్లిపోతుంది. ప్రాణాలు పోతాయనుకున్న తరుణంలో ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: వామ్మో.. వీడికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు.. దొంగతనం చేస్తూనే ఎలా కవర్ చేసుకున్నాడో చూస్తే..


కుక్క పిల్లను మొసలి ఎత్తుకెళ్లడాన్ని గమనించిన వృద్ధుడు పరుగు పరుగున అక్కడికి వెళ్తాడు. అదే సమయలో సినీ హారో రజనీకాంత్ స్టైల్లో నోట్లో చుట్ట వెలిగించి నీటిలోకి దిగుతాడు. చివరకు నీటిలో ఉన్న మొసలిని పట్టుకుని ఒడ్డుకు తీసుకొస్తాడు. అప్పటికీ ఆ మొసలి కుక్క పిల్లను గట్టిగా పట్టుకుని ఉంటుంది. అయినా ఆ వృద్ధుడు మొసలిని వదలకుండా నోటిని గట్టిగా పట్టుకుని బలవంతంగా తెరుస్తాడు. దీంతో కుక్క పిల్ల ప్రాణాలతో (old man saved the puppy from crocodile) అక్కడి నుంచి పారిపోతుంది.

Viral Video: ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..


కుక్క పిల్లను కాపాడే క్రమంలో మొదటి నుంచి చివరి వరకూ అతను చుట్ట నోట్లో పెట్టుకునే ఇదంతా చేసేస్తాడు. ఇలా ఫైన‌ల్‌గా అతను కుక్క పిల్ల ప్రాణాలు కాపాడతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పెద్దాయన మానవత్వానికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి కుక్క పిల్ల ప్రాణాలను కాపాడటం గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 91 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీటిలో నుంచి ఒడ్డుకు చేరుకున్న జాగ్వార్.. సడన్‌గా తోక పట్టుకున్న మొసలి.. చివరకు..

Updated Date - Jul 31 , 2024 | 05:06 PM