Viral Video: చిరుతకు షాక్ ఇచ్చిన కుందేలు.. పట్టుకోవాలని ప్రయత్నించగా చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:07 PM
వేగానికి మారు పేరు చిరుత అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షణాల వ్యవధిలో మెరుపు వేగాన్ని అందుకుని వేటను తన సొంత చేసుకుంటుంది. అందుకే ఒక్కసారిగా చిరుత కంటపడ్డ జంతువు.. దాన్నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అయితే కొన్నిసార్లు ..
వేగానికి మారు పేరు చిరుత.. అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షణాల వ్యవధిలో మెరుపు వేగాన్ని అందుకుని వేటను తన సొంత చేసుకుంటుంది. అందుకే ఒక్కసారిగా చిరుత కంటపడ్డ జంతువు.. దాన్నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అయితే కొన్నిసార్లు ఇలాంటి చిరుతలకూ షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మరీ చిన్న జంతువుల చేతిలోనూ ఓటమి చవిచూడాల్సి వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరుతకు ఓ కుందేలు గట్టి షాక్ ఇచ్చింది. పట్టుకోవాలని ప్రయత్నించగా చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుత వేట కోసం వేచి చూస్తుండగా.. దూరంగా దానికి ఓ కుందేలు కనిపిస్తుంది. ఇంకేముందీ.. పెద్ద పెద్ద జంతువులను సైతం సులువుగా వేటాడే చిరుత.. కుందేలును చూడగానే ఈజీగా పట్టేసుకోవచ్చని అనుకుంది. అనుకున్నదే తడువుగా మెరుపువేగంతో (leopard tried to attack rabbit) దానిపై దాడికి దిగింది. అయితే కుందేలు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. చిరుత వేగాన్ని సైతం అధిగమించి ముందుకు దూసుకెళ్తుంది.
Viral Video: చలిలో ఆటో నడుపుతూ ఇతను చేసిన నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..
కుందేలు అత్యంత వేగంగా వెళ్లడం వల్ల పట్టుకోవడం చిరుతకు సాధ్యం కాదు. దీంతో చివరకు తన శక్తినంతా కూడదీసి మరీ కుందేలును చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా కుందేలు మాత్రం చిరుతకు (rabbit escaped from leopard) దొరక్కుండా పారిపోతుంది. మధ్యలో అదుపుతప్పి కిందపడిపోతుంది. పల్టీలు కొట్టుకుంటూ వెళ్లినా మళ్లీ బ్యాలెన్స్ చేసుకుని చిరుతకు దొరక్కుండా పారిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. వేగంగా వచ్చిన చిరుతకు సైతం దొరక్కుండా పారిపోయి చుక్కలు చూపించిన కుందేలును చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: స్కూటీపై వస్తూ ఏనుగును ఢీకొన్న యువతి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మగ చిరుతలు గంటకు 50-55 mph వేగాన్ని మాత్రమే అందుకోగలువు.. కొన్ని కుందేళ్లు 75 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు.. అందుకే ఇక్కడ చిరుత ఓడిపోవాల్సి వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘కుందేలు తప్పించుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3500కి పైగా లైక్‌లు, 1.64 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: నవ్వులపాలైన వరుడు.. వధువు డాన్స్ చేస్తుండగా.. సినిమా స్టైల్లో చేయాలని చూసి.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..