Share News

Viral Video: లో బడ్జెట్ సీసీ కెమెరా.. ఈ వ్యాపారి తెలివితేటలు మామూలుగా లేవుగా..

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:32 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బజ్జీలు వేసుకునే ఓ చిరు వ్యాపారి తన దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే అందుకోసం ప్రత్యేకంగా నగదును వెచ్చించే స్థోమత అతడికి లేదు. అయినా ఎలాగైనా...

Viral Video: లో బడ్జెట్ సీసీ కెమెరా.. ఈ వ్యాపారి తెలివితేటలు మామూలుగా లేవుగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎక్కడ ఏ మూల చిన్న ప్రమాదం జరిగినా.. లేదా ఎలాంటి వినూత్న సంఘటన చోటు చేసుకున్నా.. వీడియోల రూపంలో సోషల్ మీడియలో వైరల్ అవుతుంటుంది. అందులోనూ ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో కళ్లకు కనిపించే ఘటనలన్నీ వీడియోల రూపంలో నిక్షిప్తవుతున్నాయి. చిన్న చిన్న దుకాణాలు మొదలుకుని పెద్ద పెద్ద షాపుల వరకూ ప్రతి ఒక్కరూ అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం సర్వసాధాణమైంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ చిరు వ్యాపారి తన దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. కానీ అంత డబ్బులు వెచ్చించ లేక.. చివరకు తన తెలివిని ఉపయోగించి సీసీ కెమెరాకు ఫిక్స్ చేశాడు. ఈ వీడియో పచూసి నెటిజన్లు.. ‘‘ఈ వ్యాపారి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బజ్జీలు వేసుకునే ఓ చిరు వ్యాపారి తన దుకాణంలో సీసీ కెమెరా (CCTV camera) ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే అందుకోసం ప్రత్యేకంగా నగదును వెచ్చించే స్థోమత అతడికి లేదు. అయినా ఎలాగైనా సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఇంతలో అతడికి ఓ బంపర్ ఐడియా వచ్చింది.

Viral Video: టపాసులు పేల్చి వైరల్ అవ్వాలని చూశాడు.. చివరికి ఇలా అవుతుందని ఊహించలేకపోయాడు..


తన వద్ద ఉన్న ఫోన్‌నే సీసీ కెమెరాగా ఎందుకు ఉపయోంచకూడదు.. అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగాడు. తన స్మార్ట్ ఫోన్ కెమెరా (Smart phone) ఆన్ చేసి, గోడపై ఫిక్స్ చేశాడు. కెమెరా ఆన్ చేయగా.. అది మొత్తం ఘటనను రికార్డ్ చేస్తూ.. సీసీ కెమెరాలాగా పని చేస్తోందన్నమాట. ఇతడి వినూత్నమైన ఆలోచనను చూసి అంతా అవాక్కవుతన్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: యాక్షన్‌‌కి.. షాకింగ్ రియాక్షన్.. దంపతులను దోచువాలని చూడగా.. చివరికి ఏమైదంటే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘లో బడ్జెట్ సీసీ కెమెరా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో అయితే ప్రస్తుతం 140కి పైగా లైక్‌లు, 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఏంటా ఆవేశం.. చూస్తుండగానే కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 12:32 PM