Share News

Viral Video: వామ్మో.. ఏంటా ఆవేశం.. చూస్తుండగానే కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు..

ABN , Publish Date - Oct 15 , 2024 | 08:39 AM

ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. వాటికి కోపం వచ్చిన సందర్భాల్లో అంతే స్థాయిలో బీభత్సం కూడా చేస్తుంటాయి. అడవుల నుంచి జనావాసాలు, పంటపొలాల్లోకి చొరబడే ఏనుగులు హల్‌చల్ చేయడం చూస్తుంటాం. అలాగే మావటి సంరక్షణలో పెరిగే ఏనుగులు కూడా కొన్నిసార్లు..

Viral Video: వామ్మో.. ఏంటా ఆవేశం.. చూస్తుండగానే కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు..

ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. వాటికి కోపం వచ్చిన సందర్భాల్లో అంతే స్థాయిలో బీభత్సం కూడా చేస్తుంటాయి. అడవుల నుంచి జనావాసాలు, పంటపొలాల్లోకి చొరబడే ఏనుగులు హల్‌చల్ చేయడం చూస్తుంటాం. అలాగే మావటి సంరక్షణలో పెరిగే ఏనుగులు కూడా కొన్నిసార్లు రచ్చ రచ్చ చేస్తుంటాయి. మరికొన్ని ఏకంగా మనుషుల ప్రాణాలే తీస్తుంటాయి. ఇలాంటి భయానక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ భారీ ఏనుగు రోడ్డుపై బీభత్సం సృష్టించింది. కారును తుక్క తుక్కు చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లోని (Bihar) సరన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దసరా సందర్భంగా స్థానిక మార్కెట్ ప్రాంతంలో ఉత్సవాలను (Dussehra celebrations) నిర్వహించారు. భక్తు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉత్సవాల్లో పాల్గొన్న ఓ ఏనుగు రోడ్డుపై వస్తుండగా.. ఏం జరిగిందో ఏమో గానీ ఒక్కసారిగా దానికి కోపం కట్టలు తెంచుకుంది.

Viral Video: వామ్మో.. అలా ఎలా మింగేసింది.. కొండచిలువతో బలవంతంగా కక్కించగా.. చివరకు షాకింగ్ సీన్..


పైన మావటి కూర్చుని ఉండగానే ఏనుగు రెచ్చిపోయింది. ఎదురుగా ఉన్న ఓ కారు తన దంతాలతో అటూ, ఇటూ కదిలిస్తూ ఒక్కసారిగా పైకి ఎత్తి కింద పడేసింది. చూస్తుండగానే (elephant destroyed the car) ఆ కారును తుక్కు తుక్కు చేసేసింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న బస్సును కూడా కింద తోసేయాలని చూసింది. ఆ సమయంలో పైన ఉన్న మావటి.. ఏనుగును ఎంత అదిలిస్తున్నా లెక్కచేయలేదు. చివరకు ఆ వ్యక్తి కర్రతో కొడుతూ ఏనుగును ఎలాగోలా కట్టడి చేయగలిగాడు.

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. ఉన్నట్టుండి పైనుంచి..


అలాగే అటవీ శాఖ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని దాన్ని మరో ప్రాంతానికి తరలించారు. దీంతో అక్కడున్న వారంతా.. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఏనుగేంటీ ఇలా చేసింది’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి కారును తుక్కు తుక్కు చేసిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 08:39 AM