Share News

Viral Video: కాటేసినా పాముకు ప్రాణం పోశాడు.. చివరకు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా..

ABN , Publish Date - Aug 07 , 2024 | 10:05 AM

పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది వాటితో పరాచకకాలు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లకు కూడా షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో...

Viral Video: కాటేసినా పాముకు ప్రాణం పోశాడు.. చివరకు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా..

పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది వాటితో పరాచకకాలు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లకు కూడా షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో చాలా మంది పాము కాటుకు మృత్యువాత పడ్డ ఘటనలు కూడా చూస్తు్న్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పామును పట్టుకుని సంచిలో వేస్తుండగా సడన్‌గా కాటేసింది. అయినా పామును సురక్షితం ప్రదేశంలో వదిలిపెట్టాడు. అయితే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) గోండియా జిల్లా ఫుల్చూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సునీల్ (44) అనే వ్యక్తి పాములు పట్టుకుంటూ సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తుంటాడు. కొన్నేళ్లుగా ఇతను స్నేక్ క్యాచర్‌గా (Snake catcher) పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, మంగళవారం రాత్రి ఫుల్చూర్‌ పరిధి కరంజాలోని ఓ ఇంట్లోకి నాగుపాము దూరినట్లు సునీల్‌కు ఫోన్ వచ్చింది. దీంతో అతను వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు.

Viral Video: రైల్లో టీసీ ప్రశ్నకు యువకుడి వింత సమాధానం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..


ఇంట్లో పాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, చివరకు దాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పట్టుకున్నాడు. ఫైనల్‌గా పాము తల వద్ద గట్టిగా పట్టుకుని దాన్ని ఓ సంచిలో వేసేందుకు ప్రయత్నించాడు. అయితే సంచిలో వేసే క్రమంలో పాము వెనుక్క తిరిగి (cobra bit the snake catcher) అతడి చేతిపై కాటేసింది. దీంతో ఒక్కసారిగా అక్కుడున్న వారంతా భయంతో దూరంగా పారిపోయారు. పాము కాటేసినా అతను మాత్రం భయపడకుండా దాన్ని సంచిలో బంధించాడు. అయితే ఆ సమయంలో పాము కాటుకు గురై కళ్లు తిరిగినట్లుగా అతను కొంచెం బ్యాలెన్స్ తప్పాడు. పామును సురక్షితంగా వదిలేసిన తర్వాత.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు.

Viral Video: స్కూటీ మిడిల్ స్టాండ్ వేయాలంటే ఇబ్బందిగా ఉందా.. ఇతడి సింపుల్ ట్రిక్ చూడండి..


అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ (Snake catcher died in hospital) చివరకు మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో సునీల్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయార. ‘‘పాములకు ప్రాణం పోస్తూ.. చివరకు అదే పాము కాటుకు బలయ్యావా’’.. అంటూ బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, పాము కాటేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘పామును పట్టుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఆకలేసిన ఏనుగు.. మొదటి అంతస్తులోని ఆహారాన్ని ఎలా కొట్టేసిందో చూస్తే..

Updated Date - Aug 07 , 2024 | 10:05 AM