Share News

Viral Video: ఆలయంలో నగదు లెక్కింపులో షాకింగ్ సీన్.. సిబ్బంది చేసిన నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Oct 03 , 2024 | 08:08 PM

కొందరు ఉన్నత స్థానాల్లో ఉండి కూడా చిల్లర పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకోవడం చూస్తుంటాం. మరికొందరు పైకి హుందాగా కనిపిస్తూ లోలోపల అనేక నేరాలు చేస్తుంటారు. ఇంకొందరేమో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అతి తెలివిగా చోరీలు చేస్తుంటారు. ప్రస్తుతం ..

Viral Video: ఆలయంలో నగదు లెక్కింపులో షాకింగ్ సీన్.. సిబ్బంది చేసిన నిర్వాకం చూడండి..

కొందరు ఉన్నత స్థానాల్లో ఉండి కూడా చిల్లర పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకోవడం చూస్తుంటాం. మరికొందరు పైకి హుందాగా కనిపిస్తూ లోలోపల అనేక నేరాలు చేస్తుంటారు. ఇంకొందరేమో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అతి తెలివిగా చోరీలు చేస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి నేరాలన్నీ వీడియోల రూపంలో బయటపడుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆలయంలో హుండీ లెక్కిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది తెలివిగా చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని (Bangalore) బయటరాయణపురలోని గాలి ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు, సిబ్బంది సమక్షంలో (Temple Hundi Counting) ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వారిలో కొందరు సిబ్బంది పాల్పడిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: తాబేలు, కుందేలు మధ్య పోటీ.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


అంతా హుండీ డబ్బులు లెక్కపెడుతుండగా ఓ వ్యక్తి పైకి పరిశీలిస్తున్నట్లు నటిస్తూనే.. ఆ పక్కనే టేబుల్‌పై ఉన్న నోట్ల కట్ట తీసుకుని (Temple staff stole Hundi cash) వెనుకే ఉన్న మరో వ్యక్తికి అందిస్తాడు. అలాగే ఇంకో వ్యక్తి కూడా టేబుల్‌పై ఉన్న నోట్ల కట్ట తీసుకుని, ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి చల్లగా జారుకుంటాడు. ఇలా కంచే చేను మేసిన చందంగా ఆలయ సిబ్బంది.. దేవుడి సొమ్మును చోరీ చేశారు.

Viral Video: ఇది మామూలు టాలెంట్ కాదు భయ్యా.. సైకిల్ టైర్లతో ఇతను చేసిన విన్యాసం చూస్తే..


తాము చోరీ చేసినా ఎవరూ గమనించలేదనుకున్నారు. కానీ వీరి చేష్టలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరా కంటికి చిక్కాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దేవుడి సొమ్మును చోరీ చేయడం మహా పాపం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఈ పాముకు అత్యాశ ఎక్కువనుకుంటా.. గుడ్డును తినబోయి చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2024 | 08:08 PM