Share News

Viral Video: ఆర్టీసీ బస్సును ఆపి.. యువకుడి వింత నిర్వాకం.. వీడియోపై సజ్జనార్ ఏమన్నారంటే..

ABN , Publish Date - Sep 07 , 2024 | 02:47 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత రీల్స్ కోసం చేయరాని పనులన్నీ చేసేస్తున్నారు. కొందరు ప్రాంక్ వీడియోల పేరుతో జనాన్ని ఇబ్బంది పెడుతుంటే.. మరికొందరు ఛాలెంజ్ వీడియోల పేరుతో అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. ఇటీవల ఇలాంటి వీడియోలు చేసే వారు రోజు రోజుకూ పుట్టకొకరు, చెట్టుకొకరు అన్నట్లుగా..

Viral Video: ఆర్టీసీ బస్సును ఆపి.. యువకుడి వింత నిర్వాకం.. వీడియోపై సజ్జనార్ ఏమన్నారంటే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత రీల్స్ కోసం చేయరాని పనులన్నీ చేసేస్తున్నారు. కొందరు ప్రాంక్ వీడియోల పేరుతో జనాన్ని ఇబ్బంది పెడుతుంటే.. మరికొందరు ఛాలెంజ్ వీడియోల పేరుతో అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. ఇటీవల ఇలాంటి వీడియోలు చేసే వారు రోజు రోజుకూ పుట్టకొకరు, చెట్టుకొకరు అన్నట్లుగా తయారువుతున్నారు. ఇలాంటి ఆకతాయిల చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రోడ్డుపై ఆర్టీసీ బస్సును ఆపి వెకిలిచేష్టలు చేశాడు. ఈ వీడియో చూసిన సజ్జనార్ సీరియస్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు సోషల్ మీడియాలో వీడియోలు చేసే క్రమంలో ఓ ఛాలెంజ్‌ను స్వీకరించి దాన్ని చేసేందుకు రోడ్డుపైకి వెళ్లాడు. రోడ్డుపై ఆర్టీసీ బస్సు (RTC Bus) కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఎదురుగా బస్సు అటుగా వచ్చింది. దీంతో బస్సును ఆపేందుకు ఆ యువకుతు చేయి ఎత్తాడు. అతన్ని చూసిన డ్రైవర్ బస్సును ఆపేశాడు. తీరా బస్సు ఆగాక ఆ యువకుడు ఎక్కి కూర్చోకుండా.. ఎక్కినట్లు ఎక్కి మళ్లీ కిందకు దిగి అక్కడి నుంచి పారిపోయాడు.

Viral Video: ఎయిర్‌పోర్టులో సూట్‌కేస్‌తో షాకిచ్చిన యువతి.. ఆమె తింటున్నదేంటో చూస్తే నోరెళ్లబెడతారు..


చివరగా తాను స్వీకరించిన ఛాలెంజ్‌ను కంప్లీట్ చేశానని బెబుతాడు. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఆ యువకుడిని చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవడంతో చివరకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGS RTC MD VC Sajjanar) దృష్టికి వెళ్లింది. ఈ యువకుడి వింత నిర్వాకం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా అని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Viral Video: ప్లాట్‌ఫామ్‌పై రీల్ చేస్తున్న యువకుడు.. అప్పుడే రైలు దిగుతున్న వృద్ధుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


లైక్‌లు, కామెంట్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకోవాలని, బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వీడియోను ఆయన ఎక్స్‌లో ఏపీ పోలీసులకూ ట్యాగ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి గుర్రం లేకుండానే నడిపించాడుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2024 | 02:47 PM