Share News

Viral Video: హృదయాలను గెలుచుకున్న ట్రాఫిక్ పోలీస్.. వాహనాలు పార్క్ చేయకుండా.. ఏం చేశాడంటే..

ABN , Publish Date - Sep 06 , 2024 | 08:53 PM

వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. నో పార్కింగ్ అని బోర్డులు పెట్టినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ట్రాఫిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..

Viral Video: హృదయాలను గెలుచుకున్న ట్రాఫిక్ పోలీస్.. వాహనాలు పార్క్ చేయకుండా.. ఏం చేశాడంటే..

వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. నో పార్కింగ్ అని బోర్డులు పెట్టినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ట్రాఫిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇలాంటి సమస్యను ఓ ట్రాఫిక్ పోలీసు ఎంతో సింపుల్‌గా పరిష్కరించాడు. వాహనాలను ఎక్కడ పడితే ఎక్కడ పార్క్ చేయకుండా వాహనాలకు ఎలా చెబుతున్నాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులకు (Traffic Police) వాహనదారులతో నిత్యం అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రధానంగా పార్కింగ్ విషయంలో ఎక్కువ సమస్యల వస్తుంటాయి. ఎంత హెచ్చరించినా వాహనదారులు మాత్రం నోపార్కింగ్ (No parking) స్థలాల్లోనే పార్క్ చేస్తుంటారు. ఎన్నిసార్లు జరిమానా విధించినా.. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు.

Viral Video: ప్లాట్‌ఫామ్‌పై రీల్ చేస్తున్న యువకుడు.. అప్పుడే రైలు దిగుతున్న వృద్ధుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


అయితే ఇలాంటి సమస్యను మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ పోలీసు వినూత్నంగా పరిష్కరించాడు. దలేర్ మెహందీ చిత్రంలోని ‘‘బోలో తరారా’’.. పాట అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ పాత పాటను ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ తనకు అనుగుణంగా మార్చుకుని పాడాడు. ‘‘నో పార్కింగ్ మే నా గడ్డి పార్క్ కరియే, నాప్ ది హాయ్ గడ్డి ఫిర్ నాప్ రహ్ గయీ బోలో తా రా రా’’.. అంటూ హిందీలో పాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పోలీసు పాట (song) పాడడం చూసి జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. వాహనదారులు కూడా వాహనాలను నో పార్కింగ్ స్థలంలో పార్క్ చేయడం లేదు.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి గుర్రం లేకుండానే నడిపించాడుగా..


ఇలా ఈ పోలీసు వాహనదారుల్లో పాట రూపంలో మార్పు తీసుకొచ్చాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గాయకుడిగా పుట్టి.. పోలీసు అయినట్లు ఉన్నాడు’’.. అంటూ కొందరు, ‘‘పాట ద్వారా వాహనదారులను ఎంతో బాగా అలెర్ట్ చేస్తున్నారు’’.. అంటూ మరికొందరు, ‘‘మీ పాట వినడానికి వాహనదారులంతా అక్కడే పార్క్ చేస్తారేమో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఒళ్లు జలదరించే సీన్.. మూడు పాములను మింగిన కింగ్ కోబ్రా.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2024 | 08:53 PM