Share News

Viral Video: వామ్మో.. ఒళ్లు జలదరించే సీన్.. మూడు పాములను మింగిన కింగ్ కోబ్రా.. చివరకు..

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:08 PM

పాములకు సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఒక పాము మరో పాముపై దాడి చేయడం చూస్తుంటాం. అలాగే పెద్ద పెద్ద కొండ చిలువులను పాములను మింగేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే..

Viral Video: వామ్మో.. ఒళ్లు జలదరించే సీన్.. మూడు పాములను మింగిన కింగ్ కోబ్రా.. చివరకు..

పాములకు సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఒక పాము మరో పాముపై దాడి చేయడం చూస్తుంటాం. అలాగే పెద్ద పెద్ద కొండ చిలువులను పాములను మింగేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న ఓ కింగ్ కోబ్రా వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక పాము ఏకంగా మూడు పెద్ద పాములను మింగేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ప్రస్తుతం (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పొడవాటి కింగ్ కోబ్రా (King Cobra) పాము రోడ్డు పక్కన ఎటూ కదలకుండా పడుకుని ఉంటుంది. దీంతో చుట్టు పక్కల వారు భయంతో దూరంగా పారిపోయారు. అయితే చివరకు స్నేక్ క్యాచర్లు అక్కడికి వచ్చి పామును పరిశీలిస్తారు. తీరా చూడగా.. ఆ పాము ఏదో మింగినట్లు తెలుసుకుంటారు.

Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..


పాము ఏదో మింగిందని తెలియగానే పామును అటూ, ఇటూ కదపగా చివరకు కింగ్ కోబ్రా కడుపులో ఉన్నది కక్కేసింది. తీరా చూస్తే దాని కడుపు నుంచి మరో పెద్ద పాము బయటికి వచ్చింది. అంతలోనే దాని వెంట మరో రెండు పాములు కూడా బయటికి వచ్చాయి. ఇలా మొత్తం మూడు పాములను బయటకు కక్కేసింది. ఒక పాము మూడు పెద్ద పెద్ద పాములను (king cobra swallowed three snakes) మింగేయడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


చాలా మంది ఈ పామును తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కనిపించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘తర్వాత ఎవర్ని మింగేయాలా... అని చూస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఒకే చెప్పు ఉందని పక్కన పడేస్తున్నారా.. ఇతడు ఎలా వాడేశాడో చూస్తే.. ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2024 | 04:08 PM