Share News

Viral Video: కుక్కపై దాడి చేసిన చిరుతపులి.. ప్రాణాలు పోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..

ABN , Publish Date - Sep 05 , 2024 | 07:13 PM

నివాస ప్రాంతాల్లోకి చొరబడే పులులు, సింహాలు.. కొన్నిసార్లు ఇళ్లళ్లోని కోళ్లు, కుక్కలు, గేదెలపై దాడి చేయడం తరచూ చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఏకంగా ఇళ్లలోకి దూరి మరీ కుక్కలను ఎత్తుకెళ్లే పులులను చూస్తుంటాం. అయితే ..

Viral Video: కుక్కపై దాడి చేసిన చిరుతపులి.. ప్రాణాలు పోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..

నివాస ప్రాంతాల్లోకి చొరబడే పులులు, సింహాలు.. కొన్నిసార్లు ఇళ్లళ్లోని కోళ్లు, కుక్కలు, గేదెలపై దాడి చేయడం తరచూ చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఏకంగా ఇళ్లలోకి దూరి మరీ కుక్కలను ఎత్తుకెళ్లే పులులను చూస్తుంటాం. అయితే అప్పుడప్పుడూ పులులకూ షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత పులి పడుకున్న ఉన్న కుక్కపై దాడి చేసింది. అయితే ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని వల్సాడ్ జిల్లా రోలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి బయట వారి పెంపుడు కుక్క పడుకుని ఉంది. అర్ధరాత్రి సమయంలో ఓ చిరుత పులి (Leopard) అటుగా వచ్చింది. కుక్కను చూసి చిరుత దాడి చేసేందుకు సమీపానికి వెళ్లింది.

Viral Video: ఇది మామూలు టెక్నిక్ కాదుగా.. ఆటోను బైక్‌లా కాలితో ఎలా తిప్పేశాడో చూస్తే..


కుక్కకు అనుమానం రాకుండా మెల్లగా కుక్క వద్దకు వెళ్లింది. అత్యంత సమీపానికి వెళ్లిన తర్వాత చాలా సేపు అలాగే నిలబడి కుక్కను గమనిస్తూ ఉంది. ఈ క్రమంలో మెల్ల మెల్లగా (leopard attacked dog) కుక్క మెడ వద్దకు తల పెట్టి, ఒక్కసారిగా పట్టేసుకుంది. దీంతో కుక్క దాన్నుంచి తప్పించుకునే క్రమంలో తెగ ప్రయత్నాలు చేసింది. అయినా చిరుతపులి దాన్ని వదలకుండా పక్కకు లాక్కెళ్లింది. అయితే కుక్క మెడలో ఇనుప ముళ్లులతో కూడిన బెల్టు కట్టి ఉండడంతో చిరుతపులి కొరకలేకపోయింది. చివరకు దాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది.

Viral Video: వామ్మో.. వైల్డ్ బీస్ట్ పవర్ మామూలుగా లేదుగా.. సింహాలు చుట్టుముట్టడంతో.. చివరకు చూస్తుండగానే..


ఇలా బెల్టు కారణంగా చిరుత పులి బారి నుంచి కుక్క ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘కుక్కకు బెల్టు కట్టడం మంచిదైంది’’.. అంటూ కొందరు, ‘‘చిరుతపులికి షాక్ ఇచ్చిన కుక్క’’.. అంటూ మరికొందరు, ‘‘ధైర్యమే కుక్కను కాపాడింది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Sep 05 , 2024 | 07:13 PM