Share News

Viral Video: ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. ఎంత సింపుల్‌గా ఎత్తుకెళ్లాడంటే..

ABN , Publish Date - Sep 05 , 2024 | 08:52 PM

కొందరు ఎంతో తెలివిగా చోరీలు చేస్తుంటారు. మరికొందరు మన మధ్యే ఉంటూ.. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పర్సులు కొట్టేయడం, వస్తువులను ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఇలా దొంగలు రోజు రోజుకూ చోరీలు చేయడంలో వినూత్న పద్ధతులను అవలంభించడం చూస్తు్న్నాం. ఇలాంటి..

Viral Video: ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. ఎంత సింపుల్‌గా ఎత్తుకెళ్లాడంటే..

కొందరు ఎంతో తెలివిగా చోరీలు చేస్తుంటారు. మరికొందరు మన మధ్యే ఉంటూ.. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పర్సులు కొట్టేయడం, వస్తువులను ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఇలా దొంగలు రోజు రోజుకూ చోరీలు చేయడంలో వినూత్న పద్ధతులను అవలంభించడం చూస్తు్న్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు ఎంతో తెలివిగా చోరీకి పాల్పడడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు (younth) బైకులో వచ్చి దుకాణం వద్ద ఆగుతారు. ఓ వ్యక్తి బైకుపైనే ఉండగా.. మరో వ్యక్తి బైకు దిగి షాపులోకి వస్తాడు. దుకాణ యజమానితో తనకు కావాల్సిన సిగరెట్ ప్యాకెట్‌ అడుగుతాడు. ప్యాకెట్ ఇవ్వగానే చేతిలోకి తీసుకున్న యువకుడు.. దాని వైపు తేరిపారా చూసి, బైకులో ఉన్న తన స్నేహితుడి వైపు చూస్తాడు.

Viral Video: కుక్కపై దాడి చేసిన చిరుతపులి.. ప్రాణాలు పోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..


తన స్నేహితుడితో ఏదో మాట్లాడటానికి వెళ్తున్నట్లుగా దగ్గరికి వెళ్తాడు. తీరా బైకు వద్దకు వెళ్లి కొద్ది సేపు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ఇద్దరూ అక్కడి నుంచి పరారవుతారు. దీంతో వారి నిర్వాకానికి అవాక్కవడం దుకాణ యజమాని వంతవుతుంది. ఇలా ఆ యువకులు అతి తెలివిగా చోరీకి (theft) పాల్పడడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: ఇది మామూలు టెక్నిక్ కాదుగా.. ఆటోను బైక్‌లా కాలితో ఎలా తిప్పేశాడో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి చోరీ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి చిల్లర పనులు చేయడం సరికాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. వైల్డ్ బీస్ట్ పవర్ మామూలుగా లేదుగా.. సింహాలు చుట్టుముట్టడంతో.. చివరకు చూస్తుండగానే..

Updated Date - Sep 05 , 2024 | 08:52 PM