Optical illusion: ఈ పార్క్లో దాక్కున్న పులిని.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Nov 27 , 2024 | 12:43 PM
మన మెదడుకు పరీక్ష పెట్టే అనేక రకాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని ఫొటోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. పైకి కనిపించేది ఒకటైతే.. అందులో అంతర్లీనంగా అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. వీటిని..
మన మెదడుకు పరీక్ష పెట్టే అనేక రకాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని ఫొటోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. పైకి కనిపించేది ఒకటైతే.. అందులో అంతర్లీనంగా అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. వీటిని పరిష్కరించడం కొన్నిసార్లు కష్టంగా అనిపించినా.. చాలా మంది ఆసక్తిచూపుతుంటారు. ప్రస్తుతం మీ కోసం ఆ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలోని పార్క్లో ఓ పులి దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కొందరు పిల్లలు ఓ పార్క్లో ఆడుకుంటుంటారు. అలాగే ఓ మహిళ అక్కడే ఉన్న ఓ బెంచిపై కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఆమె పక్కనే పెంపుడు కుక్క పడుకుని ఉంటుంది. అక్కడ ఉన్న చెక్క వంతెనపై ఓ పిల్లాడు పరుగెడుతుంటాడు.
అక్కడే ఉన్న ఓ బాలిక వంతెన పైనుంచి జారుడు బల్లపై జారేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరో బాలిక వంతెనపైకి వెళ్లేందుకు నిచ్చెన ఎక్కుతుంటుంది. అదేవిధంగా మరో నలుగురు పిల్లలు వంతెన కింద ఆడుకుంటుంటారు. ఆ పక్కనే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఈ పార్క్లో (Park) చాలా చెట్లు కూడా ఉంటాయి. అంతకు మించి ఇంకే జంతువూ లేనట్లు అనిపిస్తుంది.
Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..
కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే పార్క్లో ఓ పెద్ద కూడా (tiger in hiding) దాక్కుని ఉంటుంది. అయితే ఆ పులిని కనుక్కోవడం అంత సులభమేమీ కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది ఆ పులిని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం.. ఆ పులి ఎక్కడుందో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ పులిని గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.