Share News

Viral Video: దాడి చేయడానికి వచ్చిన పులి.. సమీపానికి రాగానే సడన్ షాక్ ఇచ్చిన రైతు.. చివరకు..

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:30 AM

పులి దాడికి సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. పులి ఒక్కసారి టార్గెట్ చేసిందంటే.. ఇక అవతల ఎలాంటి జంతువున్నా ఇట్టే దానికి ఆహారమైపోవాల్సిందే. అయితే కొన్నిసార్లు అలాటి పెద్ద పులికి కూడా షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. నోటి దాకా వచ్చిన ఆహారం కాస్తా.. అనూహ్యంగా జారిపోవడాన్ని చూస్తుంటాం. మరికొన్నిసార్లు..

Viral Video: దాడి చేయడానికి వచ్చిన పులి.. సమీపానికి రాగానే సడన్ షాక్ ఇచ్చిన రైతు.. చివరకు..

పులి దాడికి సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. పులి ఒక్కసారి టార్గెట్ చేసిందంటే.. ఇక అవతల ఎలాంటి జంతువున్నా ఇట్టే దానికి ఆహారమైపోవాల్సిందే. అయితే కొన్నిసార్లు అలాటి పెద్ద పులికి కూడా షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. నోటి దాకా వచ్చిన ఆహారం కాస్తా.. అనూహ్యంగా జారిపోవడాన్ని చూస్తుంటాం. మరికొన్నిసార్లు మనుషులపై దాడి చేయబోయి చివరికి తోక ముడవాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పులి రైతుపై దాడి చేయడానికి వచ్చింది. అయితే తీరా సమీపానికి రాగానే రైతు దానికి సడన్ షాక్ ఇచ్చాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలో (China) చోటు చేసుకుంది. పొలంలో పంటకు కాపలాగా ఉన్న రైతుకు ఊహించని అనుభవం ఎదురైంది. ఒసదరు రైతు ఒంటిరిగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన జరిగింది. రైతు ఉన్న ప్రాంతంలోకి చొరబడ్డ పులి ఆహారం కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో రైతును చూసిన పులి.. దాడి చేయడానికి పరుగు పరగున వచ్చింది.

Viral Video: అంకుల్‌‌తో టూరిస్ట్ సెల్ఫీ.. మధ్యలో అతడి నిర్వాకానికి అంతా షాక్..


పులిని చూడగానే కంచె లోపలికి వెళ్లి ఇనుప గేటును క్లోజ్ చేశాడు. సమీపానికి (tiger tried to attack the farmer) వచ్చిన పులి.. లోపలికి వచ్చే క్రమంలో గేటును బలంగా ఢీకొంటుంది. అయితే తలకు గేటు బలంగా తాకడంతో ఒక్కసారిగా వెనుదిరికి అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా గేటు కారణంగా ఆ రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral Video: వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్.. పోటీ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వివిధ వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గేటు తాకగానే భయపడి వెనక్కు వెళ్లిపోవడం ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘తోక ముడిచిన పులి.. ఇతడి టైం బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కిక్కు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది.. ఏదో చేయాలని చూస్తే.. చివరికి..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 27 , 2024 | 11:30 AM