Share News

Viral Video: ఎంత సెంటిమెంట్ సాంగ్ అయితే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా.. తేనెతుట్టెలో తల పెట్టి మరీ..

ABN , Publish Date - Jul 09 , 2024 | 08:21 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా.. ఫైనల్‌గా నెట్టింట వైరల్ అవడమే అందరి లక్ష్యం. అయితే ఈ క్రమంలో చాలా మంది త్వర త్వరగా ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో చిత్రచిచిత్ర విన్యాసాలన్నీ చేసేస్తుంటారు. కొందరు ..

Viral Video: ఎంత సెంటిమెంట్ సాంగ్ అయితే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా.. తేనెతుట్టెలో తల పెట్టి మరీ..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా.. ఫైనల్‌గా నెట్టింట వైరల్ అవడమే అందరి లక్ష్యం. అయితే ఈ క్రమంలో చాలా మంది త్వర త్వరగా ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో చిత్రచిచిత్ర విన్యాసాలన్నీ చేసేస్తుంటారు. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు తమ ప్రాణాలు కూడా లెక్కచేయకుండా సాహసాలు చేసేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సెంటిమెంట్ సాంగ్‌కు రీల్ చేసే క్రమంలో ఓ యువకుడు చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు (young man) రీల్స్ చేసే క్రమంలో ఓ సెంటిమెంట్ సాంగ్‌కు (sentimental song) ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ యాక్టింగ్ చేయాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే ఓ సాంగ్‌ను సెలెక్ట్ చేసుకుని వీడియో స్టార్ట్ చేస్తాడు. అయితే ఓ తేనె తుట్ట (Honeycomb) సమీపానికి వెళ్లి యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. పాటకు లిప్ సింక్ చేస్తూ బాధాకరంగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఈ క్రమంలో అతను ఒక్కసారిగా తేనె తుట్టలో తల పెట్టి మరీ ఈగలను కదుపుతాడు. ఇలా చాలాసార్లు తన తలను తేనె తుట్టలో పెడుతూ ఈగలను చేత్తో పట్టుకుంటూ పాట పాడుతుంటాడు.

Viral Video: పెద్దాయనా.. ఏంటీ పని.. స్వీట్ షాపు ఎదుట ఈ వృద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి..


తేనె తుట్లలో తల పెట్టిన ప్రతి సారీ పైకి లేచిన ఈగలన్నీ కాసేపటికి మళ్లీ తేనె తుట్టలోకి వచ్చి చేరుతుంటాయి. అయితే అదృష్టవశాత్తు ఈగలు అతడిపై దాడి చేయకపోవడంతో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తెలివితక్కువ పులిని ఎప్పుడైనా చూశారా.. నీటిలో పాము అనుకుని చివరకు అది చేసిన నిర్వాకం..

Updated Date - Jul 09 , 2024 | 08:23 PM