Share News

Viral Video: నొప్పి లేకుండా రక్తం తీయడం ఇప్పుడు యమఈజీ.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..

ABN , Publish Date - Jul 07 , 2024 | 06:19 PM

కొందరు ఆస్పత్రి అంటేనే భయపడుతుంటారు. డాక్టర్ వద్దకు వెళ్లగానే ఎక్కడ ఇంజెక్షన్ వేస్తాడో అని తెగ ఆందోళన పడుతుంటారు. ఇలాంటి వారి భయాన్ని ఇంకా పెంచేలా.. రక్తం తీసే సమయంలో నరాలు కనపడక వైద్యులు పదే పదే ...

Viral Video: నొప్పి లేకుండా రక్తం తీయడం ఇప్పుడు యమఈజీ.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..

కొందరు ఆస్పత్రి అంటేనే భయపడుతుంటారు. డాక్టర్ వద్దకు వెళ్లగానే ఎక్కడ ఇంజెక్షన్ వేస్తాడో అని తెగ ఆందోళన పడుతుంటారు. ఇలాంటి వారి భయాన్ని ఇంకా పెంచేలా.. రక్తం తీసే సమయంలో నరాలు కనపడక వైద్యులు పదే పదే చర్మంపై ఇంజెక్షన్ చేస్తుంటారు. దీంతో చిన్న పిల్లలతో పాటూ కొందరు పెద్ద వారు కూడా ఇంజెక్షన్ అంటేనే భయపడుతుంటారు. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇందులోనూ సులభ పద్ధతిని తీసుకొచ్చారు. రోగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్తం తీసే విధానానికి సంబంధించిన వీడియోను.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. వినూత్న ప్రయోగాలను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) .. తాజాగా ఓ వినూత్నమైన వీడియోను షేర్ చేశారు. సాధారణంగా ఆస్పత్రుల్లో బ్లడ్ శాంపిల్స్ కోసం రక్తం తీసే సమయంలో, సెలైన్ బాటిల్స్ ఎక్కించే సమయంలో చేతిపై నరాన్ని గుర్తించేందుకు పదే పదే నిడిల్‌తో గుచ్చాల్సి వస్తుంటుంది. దీంతో రోగి నొప్పితో ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది.

Viral Video: ఫస్ట్ నైట్ రోజు కొత్త జంట విచిత్ర నిర్వాకం.. ఫోన్ కెమెరా ఆన్ చేసి మరీ..


అయితే ఇలాంటి సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు కొత్త పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీ (infrared technology) ఆధారరంగా రోగి చేతిపై లేజర్ లైట్ తరహాలో కాంతిని ప్రసరింపజేస్తారు. తద్వారా చేతిపై నరాలు (Nerves on the arm) ఏయే ప్రాంతంలో ఉన్నాయో కరెక్ట్‌గా చూపిస్తుంది. తద్వారా రోగికి సులభంగా ఇంజెక్షన్ (Injection) చేయొచ్చు. ఈ టెక్నాలజీ వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..


కాగా, ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ టెక్నాలజీ ఎంతో అద్భుతంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘దీంతో రోగుల భయాన్ని పోగొట్టవచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో మేడపైకి వెళ్లిన ప్రేమికులు.. ఎవరూ చూడలేదనుకుని..

Updated Date - Jul 07 , 2024 | 06:19 PM