Viral Video: పొగడ్తలకు నిజంగానే పడిపోయిందిగా.. తోటి బైకర్ మాటలతో ఈ యువతికి పరిస్థితి చివరకు..
ABN , Publish Date - Dec 03 , 2024 | 07:23 PM
ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుంటాయి. కొందరు అధిక వేగంతో డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే..
ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుంటాయి. కొందరు అధిక వేగంతో డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ యువతికి విచిత్ర అనుభవం ఎదురైంది. బైక్‌లో వెళ్తుండగా.. తోటి బైకర్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. దీంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘పొగడ్తలకు నిజంగానే పడిపోయిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు బైకర్లు పర్యాటక ప్రదేశంలో కొండలపై రైడ్ చేస్తుంటారు వారిలో ఓ యువతి (young woman) కూడా బైక్ రైడ్ చేస్తుటుంది. కొండల్లో వెళ్తు్న్న సమయంలో వారిలో యువతి ముందు వైపు వెళ్తుంటుంది. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వెనుక వెళ్తున్న బైకర్.. తమ రైడింగ్ గురించి తన ఫాలోవర్లకు వివరిస్తుంటాడు. ఎంతో అందమైన ప్రదేశంలో బైక్ రైడ్ (Bike ride) చేస్తే చాలా మంచి అనుభూతి కలుగుందని చెబుతాడు.
Viral Video: గోతిలో పడ్డ బండి తాళాలు.. గమనించిన పిల్లి ఎలా తెచ్చిపెట్టిందో చూస్తే..
ఆ తర్వాత తన ముందు వెళ్తున్న యువతిపై కూడా ప్రశంసలు కురిపించబోతాడు. అయితే అతను ఇలా పొగడ్తలు స్టార్ట్ చేయగానే సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. రోడ్డు మలుపు తిరిగే సమయంలో యువతి ప్రమాదవశాత్తు జారి రోడ్డు పక్కన ఉన్న కొంత దూరం వరకు ఈడ్చుకెళ్తుంది. దీంతో వెనుక వస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే తమ బైకులు ఆపి, పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పైకి లేపుతారు.
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పొగడ్తలకు పడిపోవడమంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘రోడ్డుపై మలుపు తిరిగే సమయంలో ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral: ఈ బీరువాను చోరీ చేయడం అంత ఈజీ కాదు.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..