Share News

Viral Video: వరద నీటిలో బైకుపై వెళ్తున్నారా.. అయితే ఇలాక్కూడా జరగొచ్చు.. జాగ్రత్త..

ABN , Publish Date - Aug 13 , 2024 | 08:17 PM

వర్షాకాలంలో వరద నీటి మాటున అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా రోడ్డుపై వరద నీటిని దాటే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. కొన్నిసార్లు వరద నీటిలో మ్యాన్‌హోళ్లలో పడిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి...

Viral Video: వరద నీటిలో బైకుపై వెళ్తున్నారా.. అయితే  ఇలాక్కూడా జరగొచ్చు.. జాగ్రత్త..

వర్షాకాలంలో వరద నీటి మాటున అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా రోడ్డుపై వరద నీటిని దాటే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. కొన్నిసార్లు వరద నీటిలో మ్యాన్‌హోళ్లలో పడిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముగ్గురు యువకులు బైకుపై వరద నీటిలో వెళ్తుండగా ఉన్నట్టుండి ఊహిచని ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఢిల్లీలో (Delhi) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా వరద నీరు (flood water) మొత్తం రోడ్డుపై నిలిచి ఉంటుంది. అయినా వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ క్రమంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఒకే బైకుపై వస్తుంటారు.

Viral Video: హాయిగా పడుకుందామని వెళ్లాడు.. మంచం కింద నుంచి శబ్ధాలు రావడంతో.. పరుపు తీసి చూడగా..


అయితే వరద నీరు కారణంగా రోడ్డుపై గుంతలు కనిపించకపోవడంతో మధ్యలో ఊహించని ప్రమాదం (accident) జరుగుతుంది. వేగంగా వస్తున్న సమయంలో ఉన్నట్టుండి ముందు టైరు గోతిలో పడుతుంది. దీంతో బైకు పల్టీలు కొడుతుంది. బైకుపై ఉన్న ముగ్గురు యువకులూ ఒకరి మీద మరొకరు పడిపోతారు. అయితే ఈ ఘటనలో వారికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: ఛీ.. ఛీ.. యవ్వనంగా కనిపించేందుకు ఈమేంటీ ఇలా చేసిందీ.. ముఖానికి ఏం రాసుకుందో తెలిస్తే..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వరద నీటిలో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘దేశ రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఈశాన్య ఢిల్లీలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పురి విప్పిన నెమలికి ఇంత పవర్ ఉంటుందా.. వెనుక నుంచి పులి దాడి చేస్తుందనగా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Aug 13 , 2024 | 08:18 PM