Share News

Viral video: అర్ధరాత్రి వాచ్‌మెన్‌కు షాకిచ్చిన ఆకతాయిలు.. ఫొటో తీస్తుండగా.. చివరకు..

ABN , Publish Date - Jun 13 , 2024 | 05:48 PM

కొందరు యువకులు జల్సాలకు అలవాటు పడి వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. మరికొందరు చోరీలనే వృత్తిగా ఎంచుకుని చివరకు జైలుపాలవుతుంటారు. ఇంకొందరు రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులకు దిగుతుంటారు. ఇలాంటి...

Viral video: అర్ధరాత్రి వాచ్‌మెన్‌కు షాకిచ్చిన ఆకతాయిలు.. ఫొటో తీస్తుండగా.. చివరకు..

కొందరు యువకులు జల్సాలకు అలవాటు పడి వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. మరికొందరు చోరీలనే వృత్తిగా ఎంచుకుని చివరకు జైలుపాలవుతుంటారు. ఇంకొందరు రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులకు దిగుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అర్ధరాత్రి కొందరు ఆకతాయిలు అనుమానాస్పందంగా సంచరిస్తున్నారు. వారిని గమనించిన వాచ్‌మెన్ ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏ జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌లో (Punjab) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి కొందరు ముగ్గురు యువకులు ఓ వీధి గుండా వెళ్తుంటారు. ఓ దుకాణం వద్ద కాపలాగా ఉన్న వాచ్‌మెన్ వారికి కనిపిస్తాడు. అయినా వారు అతడి కంట పడకుండా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే అప్పటికే వారిని గమనించిన వాచ్‌మెన్.. దగ్గరికి రమ్మని పిలుస్తాడు. ముగ్గురినీ వరుసగా నిలబెట్టి ఫొటో తీసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ క్రమంలో వారిలో ఓ యువకుడు (Youth attack on watchmen) వాచ్‌మెన్‌పై దాడికి దిగుతాడు. చివరకు అతడి చేతిలోని ఫోన్ లాక్కుంటాడు. ఈ క్రమంలో ఫోన్ నేలపై పడిపోతుంది.

Viral video: ఓరి దీని వేషాలో..! మాంసం కోసం ఎలుగుబంటి ఎదుట ఈ తోడేలు విన్యాసాలు చూస్తే..


వాచ్‌మెన్‌‌పై మూకుమ్మడిగా దాడి చేసిన తర్వాత.. కింద పడిన ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాచ్‌మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘రోజురోజుకూ ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: ఇదెలా సాధ్యం.. రాళ్లు పగులగొట్టగా మధ్యలో ఇతడికి దొరికిన వస్తువులేంటో చూడండి..

Updated Date - Jun 13 , 2024 | 05:48 PM