Share News

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి ‘దివ్య జ్యోతిర్లింగ దర్శనయాత్ర’ రైలు..

ABN , Publish Date - Jul 10 , 2024 | 10:47 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి శ్రావణమాసం ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ‘దివ్య జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేరిట ఆగస్టు 4 నుంచి 12 వరకు పలు పుణ్యక్షేత్రాలను దర్శించేలా టూర్‌ను ప్లాన్‌ చేశారు.

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి ‘దివ్య జ్యోతిర్లింగ దర్శనయాత్ర’ రైలు..

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి శ్రావణమాసం ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ‘దివ్య జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేరిట ఆగస్టు 4 నుంచి 12 వరకు పలు పుణ్యక్షేత్రాలను దర్శించేలా టూర్‌ను ప్లాన్‌ చేశారు. ఈ యాత్రలో భాగంగా తిరువన్నామలైలో అరుణాచలం ఆలయం, రామేశ్వరం(Rameswaram)లో రామనాథస్వామి టెంపుల్‌, కన్యాకుమారిలో కుమారి అమ్మన్‌, త్రివేండ్రంలో పద్మనాభస్వామి, తిరుచ్చిలో రంగనాథస్వామి, తంజావూరులో బృహదేశ్వరాలయాన్ని దర్శించుకోవచ్చు.

ఇదికూడా చదవండి: MP Etala Rajender: ఉద్యోగాల ఊసెత్తని ప్రభుత్వం: ఈటల


ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్‌, ఖాజీపేట(వరంగల్‌), ఖమ్మం(Secunderabad, Khajipet (Warangal), Khammam), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు(Ongole, Nellore, Gudur), రేణిగుంట స్టేషన్‌లలో ప్రయాణికులకు మార్గమధ్యలో ఎక్కే/దిగే సౌకర్యాన్ని కల్పిస్తుంది. యాత్రకు స్లీపర్‌ టికెట్‌ ధర రూ.14,250 కాగా, కంఫర్ట్‌ కేటగిరీకి రూ.28,450గా నిర్ణయించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ సూచించారు. అలాగే, భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్‌ గౌరవ్‌ సర్క్యూట్‌ రైలు 360 మంది ప్రయాణికులతో మంగళవారం సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరింది. ఈ రైలును ప్రయాణికుల్లో ఒకరైన సీనియర్‌ సిటిజన్‌ 67 ఏళ్ల హన్మంతు ప్రారంభించారు. ఈ రైలు అయోధ్య, గయా, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని దివ్య/తీర్థ స్థలాలను 9 రోజుల్లో కవర్‌ చేస్తుందని అధికారులు తెలిపారు.


హైదరాబాద్‌-వాడి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: వాడి జంక్షన్‌ సమీపంలో జరిగే ఉర్సు ఉత్సవాలకు హైదరాబాద్‌-వాడి-హైదరాబాద్‌ మార్గంలో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌-వాడి స్పెషల్‌(రైల్‌ నెంబర్‌: 07175) ఈ నెల 20వ తేదీ ఉదయం 10.05 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 3.30 గంటలకు వాడి చేరుతుంది. వాడి- హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07176) ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4.20 గంటలకు వాడి నుంచి బయల్దేరి, రాత్రి 9.20 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. హైదరాబాద్‌-వాడి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07177) ఈ నెల 22వ తేదీ ఉదయం 5.00 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి, ఉదయం 10.15 గంటలకు వాడి చేరుతుంది. వాడి-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07178) ఈ నెల 22వ తేదీ ఉదయం 11.05 గంటలకు వాడి నుంచి బయల్దేరి, సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 10:47 AM