Share News

MLC Kavitha Health Issues: ఆరోగ్య పరీక్షల కోసం ఏఐజీ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత

ABN , Publish Date - Oct 01 , 2024 | 10:52 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం కవిత ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి ఆమెకు వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.

MLC Kavitha Health Issues:  ఆరోగ్య పరీక్షల కోసం  ఏఐజీ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత
BRS MLC Kavitha

హైడరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం కవిత ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి ఆమెకు వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి కవిత గురైన విషయం తెలిసిందే.


గతంలో రెండు సార్లు అస్వస్థత...

గతంలో తిహాడ్ జైల్లో ఉండగా కవిత రెండు సార్లు అస్వస్థతకు లోనయ్యారు. జూలై 16న తొలిసారిగా కవితను ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత జూలై 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి కవిత తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే కవితకు వైద్యం అందించారు. ఆ తర్వాత ఆగస్టు-22న మరోసారి కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి జైలుకు తీసుకెళ్లారు. కొంతకాలంగా కవిత గైనిక్‌ సమస్యలతో బాధపడుతూ ఉండటం.. దీనికి తోడు ఇటీవల వైరల్‌ జ్వరం బారినపడ్డారు. దీంతో.. కవిత భర్త అనిల్‌ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు.


జైల్లో బరువు తగ్గిన కవిత..

కవిత జైల్లో ఉండగా 11 కిలోల బరువు తగ్గారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) చెప్పడంతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. ఆమె సుమారు ఐదున్నర నెలలు జైలులోనే ఉన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు.అంతేకాదు.. సోదరి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన అన్న.. ఒక్కొక్కటిగా విషయాలను బయటకు చెప్పారు. కవితకు బీపీ పెరగడంతో మాత్రలు వేసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. జైలు శుభ్రంగా లేదని, కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. 11 వేల మంది ఖైదీలు ఉండాల్సిన తిహాడ్‌ జైల్లో 30 వేల మంది ఉన్నారని తెలిపారు. బెయిల్‌ విషయంలో ట్రయల్‌ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా కవితకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆగస్టు-27న కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ తర్వాత కవితకు బెయిల్ వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

రూ. 8,113 కోట్ల షాక్

నేరస్థులను వదలొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 01 , 2024 | 11:29 AM